ఆంధ్రప్రదేశ్‌

నిఘా కెమెరాలతో.. నేరాల కట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: నిఘా కెమెరాలతో నేర నియంత్రణ చేస్తే ఆధారాలు దొరుకుతాయనే భయం ఉంటే నేరాలే జరగవని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. అలాగే వరుస నేర చరిత్ర, ఘోరమైన నేరాలు చేసే వారి వివరాలు కంప్యూటరైజ్ చేయాలని కోరారు. కలెక్టర్ల ముగింపు సందర్భంగా మంగళవారం రాత్రి డిజిపి జెవి రాముడుతో కలిసి 23 జిల్లాల ఎస్పీలు, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో నేరాల నియంత్రణపై చర్చించారు. మహిళలపై జరిగే నేరాలను ఎలా నియంత్రించాలనే అంశంపై కలెక్టర్లతో కూడా చర్చించారు. విశ్వ విద్యాలయాల్లో వైఫై సౌకర్యాలు, సర్వై లెన్స్ కెమెరాలతో పోలీసు కంట్రోల్ రూమ్‌లతో అనుసంధానం చేయాలన్నారు. నేర రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను చూడాలన్నదే తన సంకల్పమన్నారు. రాష్ట్రంలో సాంకేతికతను జోడిస్తూ నేర నియంత్రణ జరిపేందుకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. నేరం జరిగాక చర్యలు తీసుకోడంతో సరిపెట్టకుండా అసలు నేరాలే జరక్కుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు కలెక్టర్లతో భేటీ అయిన బాబు జనవరి నుంచి అన్ని రకాల ఉపకార వేతనాలు, నెలవారీ చెల్లింపులు, బిసి, ఎస్‌సి, ఎస్‌టి సంక్షేమంపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సంక్షేమ హాస్టళ్లలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నామని, క్రమంగా సంక్షేమ హాస్టళ్లను రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలన్నారు. నాలుగేళ్లలో సంక్షేమ హాస్టల్స్ అన్నీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చేందుకు బిసి సబ్‌ప్లాన్ సిద్ధం చేశామని అధికారులు వివరించారు. రాష్ట్రంలో సామాజిక వర్గాల గణనపై దృష్టి పెట్టాలని, ప్రతి ఒక్కరి ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవాలని సంక్షేమ పథకాలు అందించటమే కాదు వాటి ఫలాలు అందుకున్నవారు సక్రమంగా ఉపయోగిస్తున్నారా లేదా ముఖ్యమని సిఎం గట్టిగా చెప్పారు. పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతలు తొలగించాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు, ఇతర సామాజిక వర్గాలకు మధ్య వ్యత్యాసాలను తొలగించటానికి సంబంధిత శాఖలు ప్రయత్నించాలన్నారు. మన టీవీ ద్వారా ఎస్‌సి, ఎస్‌టి, బిసి వర్గాలకు డిజిటల్ ఎడ్యుకేషన్ విస్తరింపచేయాలన్నారు. మంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్‌టి వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు కల్పించటానికి మూడు చోట్ల టూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పెట్టామన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ప్రతి ఐదు కిలోమీటర్ల దూరంలో రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయమంటూ ఆదేశించారు. రాష్ట్రంలో ఎయిడ్స్ నియంత్రణ పూర్తి స్థాయిలో జరుగుతోందని వైద్యాధికారులు వివరించారు. దీనిపై సిఎం మాట్లాడుతూ ‘బ్రేక్ సైలెన్స్...టాక్ ఎబౌట్ ఎయిడ్స్’ అనే నినాదం అప్పట్లో నేనిచ్చిందేనని దాని ప్రభావం ఇప్పుడు కన్పిస్తుందన్నారు. రాష్ట్రంలో ఎయిడ్స్ కేసులు 1.4 శాతమే అయినప్పటికీ ఈ ఏడాది కొన్ని కొత్తగా నమోదయ్యాయని, ఎక్కువగా గుంటూరు జిల్లాలో నమోదయ్యాయని, విజయనగరం జిల్లాలో అతి తక్కువని అన్నారు. రాష్ట్రంలో 8 వేల 924 అంగన్‌వాడీలను మంజూరు చేస్తే 4,500 ప్రాంగణాల పనులు ఇంకా ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. అంగన్‌వాడీ కేంద్రాలు ఇకపై ఫ్రీ స్కూళ్లగా రూపాంతరం చెందేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు ఫ్యాన్లు, విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అద్దె భవనాల్లో కొనసాగే అంగన్‌వాడీ కేంద్రాలను అద్దె భారం లేకుండా ఇకపై ప్రభుత్వ పాఠశాల భవనాల్లో నిర్వహించాలంటూ ఆదేశించారు. కాపు ఉద్యమం సందర్భంగా తలెత్తిన సంఘటనలపై అధికారులను చంద్రబాబు ఆరాతీసినట్టు తెలిసింది.