రాష్ట్రీయం

కొత్త పీఆర్సీకి ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 2: చాలాకాలంగా రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు ఎదురుచూస్తున్న 11వ వేతన సవరణ కమిటీ (పీఆర్సీ) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 10వ పీఆర్సీ పాత బకాయిలు రూ.3,999 కోట్లను విడతల వారీగా చెల్లించేందుకు కూడా నిర్ణయించింది. ఏపీ వర్చువల్ క్లాస్‌రూం కార్పొరేషన్ ఏర్పాటు, మచిలీపట్నంలో డీప్ వాటర్ పోర్టు పనులకు అవసరమైన రూ.1092 కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం బుధవారం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన సమావేశం ఆరు గంటలపాటు కొనసాగింది. ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవి:
* 11వ పే రివిజన్ కమిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. గత పీఆర్సీ బకాయిల్లో ఒక కిస్తీని ప్రస్తుతానికి చెల్లించేందుకు నిర్ణయం. పీఆర్సీ బకాయిలను ఎన్ని విడతలలో చెల్లించాలన్న అంశంపై ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయిస్తారు. పింఛనుదారులకు నగదు రూపంలో, ఉద్యోగులకు జీపీఎఫ్ రూపంలో చెల్లింపు. 29 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలన్న 10వ పీఆర్సీ సిఫారసును మించి ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడం తెలిసిందే. బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోగా 11వ పీఆర్సీ తన నివేదికను అందజేస్తుంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)పై చర్చ జరిగినప్పటికీ తదుపరి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.
* ఏపీ వర్చువల్ క్లాస్‌రూం కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం. ప్రస్తుతం 4 వేల వర్చువల్ తరగతి గదులనునిర్వహిస్తున్నారు. దీనిని రాష్టవ్య్రాప్తంగా విస్తరించే చర్యల్లో భాగంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది. ప్రైవేట్ కంపెనీగా ఏర్పాటయ్యే ఈ కార్పొరేషన్ విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు కానుంది.
* మచిలీపట్నం పోర్టు అభివృద్ధి, డీప్ వాటర్ పోర్టు, ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటుకు అవసరమైన రూ.1092 కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనుంది.
* అనంతపురం జిల్లా గవినివారిపల్లిలో బెస్ట్ ఇన్నోవేషన్ వర్సిటీ ఏర్పాటు.
* అనంతపురం జిల్లాలో 160 మె.వా విండ్ సోలార్ హైబ్రీడ్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు.
* విజయవాడ కమిషనరేట్, ఉంగుటూరు మండల పరిధిలోని ఆత్కూరు పోలీసు స్టేషన్‌కు సిబ్బంది మంజూరు.
* అంతర్గత జలరవాణా అభివృద్ధిలో భాగంగా విజయవాడ ఇబ్రహీంపట్నం ఫెర్రీ - రాజధాని పరిధిలోని లింగాయపాలెం మధ్య ఫెర్రీ సర్వీసులు నిర్వహించడానికి ప్రైవేట్ ఆపరేటర్లకు అనుమతులు.
* మచిలీపట్నం రాజుపేట ప్రాంతంలో అర ఎకరంలో రైతుబజారు ఏర్పాటు
* ఏపీ కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ యాక్ట్ 2002కు సవరణలు చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు ఆమోదం. ఒకే ప్లాట్‌ఫాం ద్వారా చంద్రన్న పెళ్లికానుక అందించేందుకు మార్పులతో ఆర్డినెన్స్ రూపకల్పన.
* అమరావతి రాజధాని పరిధిలో సీబీఐకి మూడున్నర ఎకరాలు, ఇగ్నోకు 80 సెంట్లు, భారత వాతావరణ సంస్థకు ఎకరం, విదేశీ వ్యవహారాల శాఖకు రెండెకరాలు, యూనియన్ బ్యాంకుకు 1.57 ఎకరాలు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌కు 1.55 ఎకరాలు, ఇండియన్ బ్యాంకుకు 1.55 ఎకరాలు, ఏపీ పోలీస్ డిపార్ట్‌మెంట్ నిఘా విభాగానికి 2000 చదరపు గజాలు, స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీకి రెండకరాలు కేటాయింపు.
* బ్రహ్మకుమారి ఎడ్యుకేషన్ సొసైటీకి గతంలో కేటాయించిన పదెకరాల భూమి పేరు మార్పుకు అంగీకారం.
* ఆదాయపు పన్ను విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఏపీ హౌసింగ్ బోర్డు యాక్ట్‌కు మార్పులు చేసేందుకు రూపొందించిన ముసాయిదా బిల్లు ఆమోదం.
* రాజమహేంద్రవరం నగర పరిధిలోని జెఎన్ రోడ్డులో రహదారి విస్తరణకు తీసుకున్న భవన సముదాయం కోసం పరిహారంగా రూ.1.15 లక్షలు చెల్లించేందుకు నిర్ణయం.
* ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజయన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ యాక్ట్‌లో రూల్స్ సవరణకు ఆమోదం. విశాఖ, తిరుపతి, పుట్టపర్తి, మచిలీపట్నం, గోదావరి, నెల్లూరు, కర్నూలు, అనంతపురం అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ ఏర్పాటుకు సంబంధించి చైర్‌పర్సన్ల హోదా, జీతభత్యాల నియమావళి ఉంటుంది.