రాష్ట్రీయం

ఇరిగేషన్‌పై మావోల కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ముపు పొంచివుందన్న సమాచారం ప్రాజెక్టులకు భద్రత కట్టుదిట్టం
* చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో తెలంగాణ పోలీస్ అప్రమత్తం
హైదరాబాద్, మే 2: వరుస ఎన్‌కౌంటర్లతో తీవ్రంగా దెబ్బతిన్న మావోయిస్టులు తమ ఉనికి చాటుకునేందుకు ఇరిగేషన్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టారన్న సమాచారం కలకలం రేకెత్తిస్తోంది. గత రెండు నెలల నుంచి పోలీసులు జరిపిన వరుస ఎన్‌కౌంటర్లలో భారీగా క్యాడర్‌ను నష్టపోవడంతో ప్రతీకారం తీర్చుకునేందుకు మావోయస్టులు రగిలి పోతున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై మావోయస్టులు దృష్టి పెట్టారన్న సమాచారంతో చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో తెలంగాణ పోలీసు శాఖ నిఘా తీవ్రతరం చేసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని మావోలు విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందన్న హెచ్చరికలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. గత ఏడాది నుంచే ఇరిగేషన్ ప్రాజెక్టులకు మావోలవల్ల ప్రమాదం పొంచి ఉందన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల మేరకు సీఆర్పీఎఫ్ దళాలను, రాష్ట్ర పోలీసు బలగాలను మోహరింప చేశారు.
తాజాగా జరిగిన గడ్చిరోలి, అంతకు ముందు చత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లలో పోలీసుల చేతిలో మావోయిస్టులు అధిక సంఖ్యలో చనిపోవడంతో నిఘా వర్గాల సమాచారం మేరకు ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు భద్రతను మరింత కట్టుదిట్టం చేసిందని విశ్వసనీయ సమాచారం. చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల నుంచి మావోయిస్టులు తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉందని సమాచారం అందడంతో సరిహద్దులో నిఘాను తీవ్రతరం చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్‌పూర్ మండల పరిధిలో ఉంది. మరికొన్ని చిన్నా, పెద్దా ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో గోదావరి నదిపై ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నందున ఆయా రాష్ట్రాల నుంచి తెలంగాణ సరిహద్దులోకి మావోయిస్టులు ప్రవేశించే అవకాశం ఉందని సమాచారం అందుకున్న పోలీసులు కూంబింగ్ ఆపరేషన్లను సైతం ఉధృతం చేశారు. ముఖ్యంగా గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న సరిహద్దులు, వంతెనల
వద్ద తనిఖీలను సైతం పెంచారు. ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అన్ని మార్గాల్లో తనిఖీ ఉధృతం చేశారు. మహదేవ్‌పూర్ మండంలోని మహదేవ్‌పూర్, కాటారం, మహాముత్తారం గ్రామాల్లో కూడా మావోయిస్టులు షెల్టర్ తీసుకునే అవకాశం ఉన్నందున అక్కడ అప్రమత్తం అయినట్లు తెలుస్తోంది. గ్రేహౌండ్స్ కూంబింగ్ ఆపరేషన్లను రెట్టింపు చేయడం ద్వారా మావోయిస్టులు తెలంగాణలో ప్రవేశించకుండా అడ్డుకునేందుకు ముందుకు వెళుతున్నారు. ఇటీవల జరిగిన మూడు ఎన్‌కౌంటర్లలో పోలీసులు విజయం సాధించడంతో మావోయిస్టులను నియంత్రించేందుకు మరింత పక్కా వ్యూహంతో ఎస్‌బి, స్పెషల్ ఇంటిలిజెన్స్ విభాగాలు పని చేస్తున్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద పనులు చేపడుతున్న నిర్మాణ కంపెనీలకు సైతం భద్రతను పెంచినట్లు తెలుస్తోంది. నిర్మాణ స్థలంలో ఉన్న వాహనాలకు, ఉద్యోగులకు సైతం అవసరమైన సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు. కేంద్రప్రభుత్వం చేపట్టిన మావోయిస్టుల ఏరివేతలో తెలంగాణ సర్కార్, ఎపి సర్కార్‌లు భాగం పంచుకుని బూటకపు ఎన్‌కౌంటర్లు చేస్తున్నందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇటీవల తెలంగాణ మావోయిస్టు పార్టీ కమిటీ ప్రకటించిన నేపధ్యంలో ముందస్తు తెలంగాణ పోలీసు శాఖ అప్రమత్తమైంది.