రాష్ట్రీయం

ఎయిమ్స్‌లో న్యూరోసర్జన్ చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 2: ఎంసెట్ ఫలితాల్లో ఉత్తరాంధ్ర విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. మెడిసిన్‌లో విశాఖ విద్యార్థిని జంగాల సాయి సుప్రియ రాష్ట్రంలోనే మొదటి ర్యాంక్ సాధించింది. అలాగే జేఈఈ మెయిన్స్‌లో దేశంలో రెండో స్థానంలో నిలిచిన విశాఖకు చెందిన సీకేవీఆర్ హేమంత్ కుమార్ ఇంజనీరింగ్‌లో ఎనిమిదవ ర్యాంక్ సాధించాడు. వీరిద్దరూ విశాఖలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల్లోనే చదువుతున్నారు. ఈ సందర్భంగా సుప్రియ ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ తను ఎయిమ్స్‌లో న్యూరోసర్జన్ చేయాలన్నది లక్ష్యంగా చేసుకున్నానని పేర్కొంది. తన తల్లిదండ్రులు మొదటి నుంచి డాక్టర్ వృత్తి గురించి గొప్పగా చెప్పుకొచ్చేవారని, దీంతో తన సోదరునికి, తనకు ఆ వృత్తిపై గౌరవం పెరిగిందని చెప్పింది. తన సోదరుడు సాయి విహార్ గత ఏడాది నీట్‌లో ఆల్ ఇండియాలో 68వ ర్యాంక్, రాష్ట్రంలో 50వ ర్యాంక్ సాధించాడని ప్రస్తుతం పూణేలోని ఆర్మ్‌డ్ ఫోర్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడని సుప్రియ పేర్కొంది. అలాగే నీట్ పరీక్షలో మంచి ర్యాంక్ సాధిస్తానని చెప్పింది. ప్రతి రోజు 13 గంటలు చదివేదాన్నని సుప్రియ చెప్పింది. ఫిజిక్స్ తనకు ఇష్టమైన సబ్జెక్ట్ అని చెప్పింది. ‘సెల్‌ఫోన్ అంటే ఏమాత్రం ఇష్టం లేదు. ఎప్పుడైనా స్నేహితులతో షాపింగ్‌కు, కుటుంబ సభ్యులతో గెట్ టుగెదర్‌కు వెళ్లేదాన్ని’ అని చెప్పింది. కాగా, సుప్రియ తండ్రి దేవీగుప్త విశాఖలోని హిందుజా పవర్ ప్లాంట్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా మెడిసిన్‌లో శ్రీచైతన్య కళాశాలకు చెందిన బీవీఎన్ తరుణ్ వర్మకు తొమ్మిదో ర్యాంక్, జేఎస్‌బీ అభిరాజ్‌కు 13వ ర్యాంక్ లభించాయి.