రాష్ట్రీయం

వేగం పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 3: రాజధాని అమరావతిలో వౌలిక సదుపాయాల పనులను, చేపట్టిన వివిధ ప్రాజెక్టులను నిర్దేశిత కాల వ్యవధిలో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఇది చాలా కీలకమైన సమయమని, ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తిచేయకుంటే సమస్యలు వస్తాయని హెచ్చరించారు. గురువారం వెలగపూడి సచివాలయంలో ఆయన సీఆర్డీఏ ప్రాజెక్టులు, రాజధాని నగరంలో స్థలాలు పొందిన యూనివర్సిటీలు, వైద్య, ఆరోగ్య సంస్థల నిర్మాణ పురోగతిని సమీక్షించారు. అమరావతి నిర్మాణంలో భాగస్వామ్య సంస్థల ప్రతినిధులను ఆహ్వానించి వారితో మాట్లాడారు. సమావేశంలో ఆనంద నగరాల సదస్సు నిర్వహణ తరువాత చేపట్టాల్సిన కార్యక్రమాలు, భూముల కేటాయింపు తాజా స్థితి, టెండర్ల షెడ్యూళ్లు, ప్రాజెక్టుల పురోగతి, వాటర్ ఫ్రంట్ ఇంజనీరింగ్, ఇండియన్ ఆయిల్ సంస్థ సహకారం తదితర అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఆనంద నగరాల సదస్సును అమరావతిలో విజయవంతంగా నిర్వహించామని ముఖ్యమంత్రి అన్నారు. సదస్సులో పాల్గొన్న పలువురు ప్రతినిధులు అమరావతి అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి స్పందిస్తూ ఆనంద నగరాల సదస్సుకు ప్రాతినిధ్యం వహించిన జాతీయ, అంతర్జాతీయ సంస్థల అనుభవం అమరావతి నిర్మాణంలోనే కాకుండా, రాష్ట్రంలోని ఇతర నగరాల అభివృద్ధికి
వినియోగించుకోవాల్సి ఉందన్నారు. విజ్ఞాన ఆధారితంగా, నవ్యావిష్కరణల ఆధారితంగా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందాలని, ఇందుకు ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ అనుసరణీయ పద్ధతులను మన రాష్ట్రానికి తీసుకురావాల్సి ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. భూటాన్, నార్వే దేశాల తరహాలో వైజ్ఞానిక పరిజ్ఞానాన్ని గ్రహించి అన్వయించుకునే సంస్కృతిని మనం పాటించాలని కోరారు.
అమరావతిలో భూములు పొందిన సంస్థలు, ఏఏ సంస్థలకు ఎంత భూములను ప్రభుత్వం కేటాయించిందో తాజా స్థితిని ముఖ్యమంత్రి సమీక్షించారు. భూముల కేటాయింపులు పొంది ఇంకా నిర్మాణాలు ప్రారంభించని సంస్థల ఉదాసీనతపై మాట్లాడుతూ ఆలస్యం చేస్తే తిరిగి సమీక్ష చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అమరావతిలో తమ ప్రాంగణాలు నెలకొల్పుకోవడానికి ప్రభుత్వం నుంచి భూములు పొందిన వివిధ సంస్థలు ఎంతవరకు నిర్మాణాలు పూర్తిచేశాయో? ఏఏ దశల్లో ఉన్నాయో వివరించే దృశ్య, శ్రవణ ప్రదర్శనలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఇండో-యుకె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రతినిధులు మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి స్పందిస్తూ అలక్ష్యం సరికాదని, చాలా ఆలస్యం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస భవనాలు, ఎన్జీవోల నివాస గృహాల పథకాలను సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు.
పద్ధతిగా వాటర్ ఫ్రంట్ పనులు
వాటర్ ఫ్రంట్ ఇంజనీరింగ్ పనులను సమీక్షిస్తూ పర్యావరణానికి హాని కలిగించని రీతిలో నిర్మాణాలు అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. రాజధాని అమరావతిని వరద నుంచి కాపాడే రైట్ ఫ్లడ్ బ్యాంక్ రీఅలైన్‌మెంట్ పనుల పురోగతి వివరాలను అధికారులు వివరిస్తున్నప్పుడు ఆయన స్పందిస్తూ 12.36 కిమీ పొడవైన ఈ నిర్మాణం అత్యంత కీలకమైందన్నారు. కృష్ణానదిలో ఐలెండ్స్‌ను పరిరక్షించవచ్చని చెప్పారు. రివర్ ఫ్రంట్‌లో సైకిల్ ట్రాకులు, నడకదారులు, ఇ-టాయిలెట్స్‌తో కూడిన పార్కులు, యాంఫి థియేటర్, బోటింగ్, ఘాట్స్ తదితర సదుపాయాలపై సీఎం సూచనలిచ్చారు. ప్రపంచంలో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం ఎక్కడ ఉన్నా మన రాష్ట్భ్రావృద్ధి కోసం తీసుకొచ్చి అన్వయించాలని ముఖ్యమంత్రి సూచించారు.
అన్న క్యాంటీన్లపై సమీక్ష
అన్న క్యాంటీన్ల నిర్మాణ పనులను సమీక్షిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సూచనలిచ్చారు. రాష్ట్రంలో 148 అన్న క్యాంటీన్లు మంజూరు చేశామని, వీటన్నింటికీ నిర్మాణ స్థలాలను గుర్తించినట్లు తెలిపారు. ఈ 148లో ఇప్పటిదాకా 100 క్యాంటీన్ల నిర్మాణానికి 100 స్థలాలను గుర్తించినట్లు తెలిపారు. అన్న క్యాంటీన్లు ఆకర్షణీయంగా ఉండాలని సీఎం ఆదేశించారు. చుట్టూ మొక్కలు పెంచి, హరిత వాతావరణం సృష్టించాలని, ఆహ్లాదంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కోరారు.
రాజధానిలో ఐటీ పార్క్ టవర్
అమరావతిలో ఐటీ పార్క్ టవర్ నిర్మాణానికి సంబంధించి షాపూర్‌జీ గ్రూప్ ప్రజెంటేషన్‌ను ముఖ్యమంత్రి వీక్షించి కొన్ని సూచనలు చేశారు. నిర్మాణ ఆకృతి నవ్యతను ప్రతిబింబించాలని, అయితే ఐటీ టవర్ ఆకృతి నమూనాకు, రాజధాని నగర నిర్మాణాల ఆకృతులకు మధ్య వైరుధ్యం ఉండకూడదని చంద్రబాబు సూచించారు. రాజధాని అమరావతి ఇంధన అవసరాలు తీరుస్తామని, ఇందుకు తమకు బహుముఖ వ్యూహం ఉందని, ఐఓసీ ప్రతినిధులు ఎస్‌ఎస్‌వి రామ్‌కుమార్, గ్యాస్ మార్కెటింగ్ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్ జిఎస్‌పి సింగ్ అన్నారు. అమరావతికి ఇంధన సరఫరా భాగస్వామిగా గత ఏడాది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓయు కుదుర్చుకున్న విషయం విదితమే. సీఆర్డీఏ సమావేశానికి ఐఓసీ ప్రతినిధులు హాజరై ఇంధన అవసరాలు తీర్చడంలో తమ ప్రతిపాదనలను, ప్రాజెక్టులను ముఖ్యమంత్రికి వివరించారు. వచ్చే ఏడాదికి అమరావతిలో ఇండోర్ ఎల్‌ఎన్‌జీ ప్లాంటు ఏర్పాటు చేస్తామని సంస్థ ప్రతినిధులు వివరించారు. చెరకు తదితర వ్యవసాయ వ్యర్ధాల నుంచి ఇథనాల్ ఉత్పత్తిని తాము ప్రారంభిస్తామని, అలాగే సౌర విద్యుత్ సెల్స్‌తో నడిచే బస్సుల రూపకల్పనకు సహకారం అందిస్తామని తెలిపారు.