రాష్ట్రీయం

కల్వర్టు పేల్చివేత - మావోయిస్టుల బంద్ ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 4: మావోయిస్టులు శుక్రవారం చేపట్టిన బంద్ ఉద్రిక్తతకు దారి తీసింది. శుక్రవారం తెల్లవారు జామున భద్రాచలం, వెంకటాపురం ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టును పేల్చివేయటంతో పోలీసులు, ప్రజలు ఉలిక్కిపడ్డారు. బంద్ సందర్భంగా ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నప్పటికి ప్రధాన రహదారిపైనే పేల్చివేత జరగటం గమనార్హం. బంద్ సందర్భంగా కొన్ని బస్‌లు తిరగగా ప్రైవేటు బస్‌లు మాత్రం నిలిచిపోయాయి. చత్తీస్‌గఢ్ నుండి భద్రాచలం వైపు రావల్సిన ప్రైవేటు బస్‌లు అక్కడే నిలిచిపోయాయి. చర్ల వరకు ఆర్టీసీ బస్‌లను తక్కువ సంఖ్యలో నడిపించారు. వెంకటాపురం, వాజేడు మండలాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయిం ది. ప్రధాన దుకాణాలన్నీ మూతపడగా మారుమూల ప్రాంతంలోని బ్యాంకులు పనిచేయలేదు. అటవీ ప్రాంతంలో సంఘటనలు జరుగుతాయని ముందుగా ఊహించిన పోలీస్ బలగాలు ఆ దిశగా కూంబింగ్ విస్తృతం చేశారు. అయితే మావోయిస్టులు తమ పంథాను మార్చుకొని ప్రధాన రహదారిపైనే కల్వర్టును పేల్చివేయటంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే మరో సంఘటన జరగకుండా అన్ని చర్యలు చేపట్టారు. ఇటీవల కాలంలో మావోయిస్టులపై ఎన్‌కౌంటర్లు జరుపుతూ పోలీసులు పైచేయి సాధించటంతో మావోలు కూడా తమ పైచేయి సాధించటంతోపాటు తాము ఈ ప్రాంతంలోనే ఉన్నామని తెలియజేసేందుకు విధ్వంసం సృష్టిస్తారని భావించిన పోలీసులు ఆ దిశగా కూంబింగ్ ముమ్మరం చేశారు. మరో వైపు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో విడుదలైన లేఖలు, పోస్టర్లు పోలీసులను కలవర పెడుతున్నాయి.