రాష్ట్రీయం

తెగని వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 4: న్యాయవ్యవస్థకు ప్రభుత్వానికి మధ్య జడ్జిల నియామకం విషయంలో నెలకొన్న వివాదం ముదురుపాకాన పడుతోంది. కొలీజియం తగిన సంఖ్యలో న్యాయమూర్తుల పేర్లను సిఫార్స్ చేయడం లేదని కేంద్రం, సిఫార్స్ చేసినవారి నియామకాలనే ఇంతవరకూ ప్రభుత్వం ఖరారు చేయలేదని అత్యున్నత న్యాయస్థానం.. ఇలా పరస్పర వాదనలకు దిగడంతో పరిస్థితి ముఖాముఖి అన్న స్థాయికి చేరుకుంది. తాజాగా శుక్రవారం సుప్రీం కోరు టలో ధర్మాసనానికి, అటార్నీ జనరల్‌కు మధ్య జరిగిన వాదోపవాదాలే ఇందుకు అద్దంపడుతున్నాయి. హైకోర్టుల్లో భారీగా ఖాళీలు పేరుకుపోతున్న నేపథ్యంలో కేవలం కొందరు న్యాయమూర్తుల నియామకాన్ని మాత్రమే కొలీజియం ఆమోదించటంతో కేంద్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో సుప్రీం కోర్టుతో వివాదానికి దిగింది. మరోపక్క కొలీజియం సిఫార్స్ చేసిన పేర్లను కేంద్రం పెండింగ్‌లో ఉంచడాన్ని సుప్రీం కోర్టు సైతం ప్రశ్నించింది. ‘మీవద్ద ఎన్ని పేర్లు పెండింగ్‌లో ఉన్నాయో మాకు తెలియజేయండి’ అంటూ న్యాయమూర్తులు మదన్ బి లోకుర్, దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్‌ను ప్రశ్నించింది. ‘మీ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలంటే నేను వివరాలను సేకరించాల్సి ఉంటుంది’ అని అటార్నీ జనరల్ జవాబివ్వడంతో ‘ప్రభుత్వానికి సంబంధించినంత వరకూ ఏకవచనంలో కాదు, బహువచనంలో మాట్లాడాలి’ అంటూ సుప్రీం కోర్టు తీవ్ర స్వరంతో పేర్కొంది. మణిపూర్, మేఘాలయ, త్రిపుర హైకోర్టుల్లో న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి సంబంధించిన అంశాన్ని సుప్రీం కోర్టు ఓ పక్క ప్రస్తావిస్తోందని, కానీ కొలీజియం మాత్రం 40 ఖాళీలు పెండింగ్‌లోవున్న హైకోర్టులకు సంబంధించి కేవలం ముగ్గురి పేర్లను మాత్రమే సిఫార్స్ చేస్తోందని వేణుగోపాల్ అన్నారు. హైకోర్టుల్లో ఖాళీల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని అవసరానుగుణమైన రీతిలో
న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన సిఫార్సులను కొలీజియం చేయాల్సి ఉంటుందని అటార్నీ జనరల్ పేర్కొన్నారు. 40కి పైగా ఖాళీలున్న నేపథ్యంలో ముగ్గురి పేర్లను మాత్రమే కొలీజియం సిఫార్స్ చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. పరిస్థితి ఇలావుంటే న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేయడంలో ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. కొలీజియం సిఫార్స్ లేకుండా న్యాయమూర్తుల ఖాళీల భర్తీ విషయంలో ప్రభుత్వం కూడా చేసేదేమీ ఉండదని ఆయన తెలిపారు. మేఘాలయ, మణిపూర్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులుగా జస్టిస్ యాకూబ్ మీర్, జస్టిస్ రామలింగం సుధాకర్‌లను నియమించాలని గత నెల 19న కొలీజియం కేంద్రానికి సిఫార్స్ చేసింది. కానీ ఇప్పటి వరకూ వాటికి సంబంధించి ఎలాంటి నియామకాలు జరగలేదని తెలిపింది. దీనికి జవాబిచ్చిన అటార్నీ జనరల్ త్వరలోనే ఈ నియామకాల అంశాన్ని పరిశీలించి తగిన ఉత్తర్వులను జారీ చేస్తామని కోర్టుకు నివేదించారు. దానికి తీవ్రంగా స్పందించిన సుప్రీం కోర్టు బెంచ్ ‘త్వరలో అంటే ఏమిటి? మూడు నెలలనా మీ ఉద్దేశం?’ అని ప్రశ్నించింది. పదిరోజుల్లో ఈ ఖాళీల భర్తీకి సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని అటార్నీ జనరల్‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించింది.