రాష్ట్రీయం

రేపిస్ట్ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురజాల, మే 4: రాష్టవ్య్రాప్తంగా సంచలనం రేపిన గుంటూరు జిల్లా దాచేపల్లి అత్యాచార ఘటన కేసులో నిందితుడు అన్నం సుబ్బయ్య (60) శుక్రవారం గురజాల మండలం, దైద గ్రామం సమీపంలోని అడవి లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాదాపు మూడు రోజుల క్రితం సభ్యసమాజం తలదించుకునేలా దాచేపల్లిలో రెండవ తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలికపై రిక్షానడిపే అన్నం సుబ్బయ్య అత్యాచారానికి పాల్పడిన దుర్ఘటన తెలిసిందే. దీంతో ప్రజల నుండి తీవ్రస్థాయిలో వెల్లువెత్తిన ఆగ్రహజ్వాలలతో
పల్నాడు ప్రాంతం అట్టుడికింది. ఈ కేసులో నిందితుడు సుబ్బయ్య గురజాల మండలం దైద గ్రామంలోని శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఉన్న అడవిలోని వేప చెట్టుకు లుంగీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే కొద్దిసేపటి ముందు బంధువులతో ఫోన్‌లో మాట్లాడిన సుబ్బయ్య తాను పాపం చేశానని, తనకు బతికే అర్హత లేదని, ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. దీంతో తెల్లవారుజామున 3 గంటల నుండి దాదాపు 9 గంటల పాటు 17 బృందాల పోలీసులు స్థానికులతో కలిసి అడవిలో గాలించి మధ్యాహ్నం 12 గంటల సమయంలో బంధువుల సహాయంతో మృతదేహాన్ని గుర్తించారు. దాచేపల్లి నుండి కృష్ణానది ఒడ్డున అడవిమార్గం గుండా నడుచుకుంటూ దైదకు చేరుకున్నట్లు భావిస్తున్నారు. పోలీసులు అడవిలో నుండి మృతదేహాన్ని దాదాపు కిలోమీటరు దూరం చేతులపై మోసుకుంటూ వచ్చి, మెయిన్ రోడ్డుకు చేరుకున్న తర్వాత వాహనంలో గురజాల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కామాంధుడి మృతదేహాన్ని తీసుకొచ్చినట్లు సమాచారం తెలియడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రభుత్వ వైద్యశాల వద్దకు తరలివచ్చారు. దీంతో ఆసుపత్రి ప్రాంగణంలో గురజాల, బాపట్ల డిఎస్‌పిలు ప్రసాద్, గంగాధర్‌ల నేతృత్వంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సుబ్బయ్య మృతదేహానికి ప్రభుత్వ వైద్యులు పోస్టుమార్టం పూర్తిచేసిన అనంతరం శాంతి భద్రతల దృష్ట్యా మృతుని కుమారుడు నరసింహారావుతో గురజాలలోనే దహన క్రియలు పూర్తిచేయించారు.