రాష్ట్రీయం

సింగపూర్ తరహా నైట్ సఫారీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 8: రాష్ట్రంలో సింగపూర్ తరహాలో నైట్ సఫారీలను అభివృద్ధి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. ఏనుగులు, కోతుల బెడదను అరికట్టేందుకు వీలుగా ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాల్‌లో మంగళవారం జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ తిరుపతి, విశాఖ నగరాల్లో నైట్ సఫారీలు, అమరావతిలో జంతు ప్రదర్శనశాల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలను ఆకర్షించే రీతిలో జంతు ప్రదర్శనశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాజమహేంద్రవరం శివారులో అటవీ భూముల్లో సఫారీ, డీర్ పార్క్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల పరిధిలో ఏకో పార్కుల అభివృద్ధికి అటవీశాఖ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది 876 కిమీ పరిధిలో ఎవెన్యూ ప్లాంటేషన్ చేయాలని ఆదేశించారు. వచ్చే మూడేళ్లలో 574 కిమీ తీర ప్రాంతంలో పచ్చదనం పెంపునకు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో కోతుల బెడద నివారణకు తక్షణమే అటవీశాఖ చర్యలు తీసుకోవాలన్నారు. వీటి బెడదను అరికట్టేందుకు ఒక కమిటీని నియమించాలన్నారు. ప్రపంచంలో ఉన్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్టీఆర్ జలసిరి పథకం కింద 50వేల పంపుసెట్లను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఏడాది జూన్‌లో వర్షాలు ఉంటాయని, ఆగస్టులో తక్కువగా పడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారన్నారు. ఈ సూచనలు పరిగణనలోకి తీసుకుని పంటలను కాపాడుకునే ప్రయత్నం చేయాలన్నారు. జలవనరుల నిర్వహణ మే నెల నుంచి మొదలుకావాలని కృష్ణాడెల్టాలో జూన్ మొదటి వారంలోనే పంటలు సాగుచేసుకునేందుకు వీలుగా మేలోనే చెరువులు నింపాలన్నారు. ప్రకాశం బ్యారేజ్‌కు ఎగువన 23 కిమీ వద్ద పులిచింతలకు దిగువన 16కిమీ దూరంలో కృష్ణానదిపై బ్యారేజీ నిర్మించాలని, అక్కడ రాజధాని అమరావతి అవసరాలకు సరిపడా 10 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చని జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ సీఎంకు తెలిపారు. గోదావరి-పెన్నా అనుసంధానానికి సంబంధించి మొదటి దశ పనులు వచ్చేనెలలో ప్రారంభించే యోచన ఉందని తెలిపారు.