రాష్ట్రీయం

మళ్లీ మొదలైన కోల్డ్‌వార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* తెలుగు రాష్ట్రాల మధ్య తగ్గని దూరం * ఏపీలో ఆర్థిక మంత్రుల భేటీకి తెలంగాణ డుమ్మా
* ఓటుకు నోటును తెరపైకి తెచ్చిన తెలంగాణ * ఫ్రంట్‌పై చంద్రబాబుతో మాట కలపని కేసిఆర్
హైదరాబాద్, మే 8: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొంతకాలంగా సద్దుమణిగిన వివాదాలు మళ్లీ రాజుకుంటున్నాయి. రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసు అటకెక్కినట్టేనని భావిస్తున్న తరుణంలో దీనిని తిరుగదోడాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కోర్టు పరిధిలో ఉన్న కేసుపై సిఎం కేసీఆర్ ఎలా సమీక్షిస్తారని ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ఓటుకు నోటు కేసు తిరగదోడటం కుట్రదాగి ఉందని, ప్రధాని మోదీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలంగాణ సిఎం కేసీఆర్‌లు కలిసి తమ సిఎం చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని కూడా సోమిరెడ్డి ఆరోపించారు. ఈ కేసుపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించిన రోజునే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రాష్ట్రాల ఆర్థికశాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గైర్హాజర్ అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు లేకపోవడం తెలంగాణ నుంచి ఆర్థిక మంత్రి హాజరుకాలేదని సమాచారం. గైర్హాజర్‌కు కారణం ఏమిటనీ మంత్రి ఈటల రాజేందర్‌ను మీడియా ప్రశ్నించగా,
గత నెలలో కేరళలో జరిగిన ఆర్థిక మంత్రుల భేటీకి కూడా హాజరుకాలేదని గుర్తు చేస్తూ సమాధానాన్ని దాట వేసారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకరావడానికి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయబోతున్నట్టు టిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఫ్రంట్ ఏర్పాటుకు మద్దతు కూడగట్టడానికి సిఎం కేసీఆర్ స్వయంగా కోల్‌కత్తా వెళ్లి తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ, బెంగళూరు వెళ్లి జనతాదళ్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో, చెన్నై వెళ్లి డిఎంకె అధినేత కరుణానిధి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌తో కేసిఆర్ చర్చించి వచ్చారు. ఇదే అంశంపై సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ను హైదరాబాద్‌కు ఆహ్వానించి కేసీఆర్ చర్చించిన విషయం తెలిసిందే. దక్షిణాది, ఉత్తరాదికి చెందిన ప్రాంతీయ పార్టీల అధినేతలతో చర్చలు జరుపుతోన్న కేసిఆర్, తోటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడితో మాత్రం ఇంతవరకు చర్చించలేదు. ఇదే విషయాన్ని సిఎం కేసీఆర్ చెన్నై వెళ్లినప్పుడు అక్కడ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, చంద్రబాబు తనకు మంచి మిత్రుడని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా చంద్రబాబు నాయుడుకు ప్రమేయం ఉన్నట్టు అభియోగం ఉన్న ఓటుకు నోటు కేసును కేసీఆర్ తిరగదోడటంతో ఫెడరల్ ఫ్రంట్‌కు చంద్రబాబు నాయుడి మద్దతు కల్లేనని రాజకీయ వర్గాలు అంచన వేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య తాజాగా కోల్డ్ వార్ మళ్లీ రాజుకుంటోంది. ప్రాంతీయ పార్టీల అధినేతలతో మంచి సంబంధాలు కలిగి జాతీయ రాజకీయాల్లో గతంలో చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఏర్పాటు చేయబోయే ఫెడరల్ ఫ్రంట్‌కు వ్యతిరేకంగా లోలోన మొకాలడ్డే ప్రయత్నాలు చేస్తుండటం వల్లనే ఓటుకు నోటు కేసును తిరగదోడటం వెనుకనున్న ఆంతర్యమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.