రాష్ట్రీయం

పది రోజుల్లో ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 8: ఓఎన్జీసీ కేజీ బేసిన్ అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దిన కృష్ణా జిల్లాలోని నాగాయలంక క్షేత్రం చమురు, సహజవాయువు నిక్షేపాల వెలికితీతకు సిద్ధమైంది. మరో పది రోజుల్లో అపారమైన, చమురు, సహజవాయువు నిక్షేపాలు కలిగిన ఈ క్షేత్రం నుంచి ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఈ క్షేత్రంలో మొత్తం నాలుగు బావులు ఉండగా అందులో పాత బావిని సరికొత్తగా ఆధునిక సాంకేతికతో ఉత్పత్తికి సిద్ధం చేశారు. కొత్తగా మరో మూడు బావులు త్వరలో ఉత్పత్తిలోకి రానున్నాయి. ఇప్పటికే సిద్ధమైన 1జడ్‌ఎస్టీ అనే బావి పనులు 2014లో మొదలయ్యాయి. మరో పది రోజుల్లో ఈ బావి నుంచి ఉత్పత్తి మొదలు కానుంది. అత్యంత పీడనం కలిగిన చమురు, సహజ వాయు నిల్వలు ఈ బావి నుంచి వెలికి రానున్నాయి. రోజుకు 150 మిలియన్ క్యూబిక్ మీటర్ల చమురు, 45వేల స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువు ఈ బావి నుంచి ఉత్పత్తి కానుంది. ఇప్పటికే కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల నుండి అవసరమైన అనుమతులు లభించాయి. ఇక ఉత్పత్తి చేయడం తరువాయిగావుంది. ఈ క్షేత్రానికి 2017లో ఫీల్డ్ డవలప్‌మెంట్ ప్లాన్‌లోనే కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయి. నాగాయలంక క్షేత్రం మొత్తం కేజీ బేసిన్‌లోనే అత్యంత విలువైన ఉత్పత్తి చేయగల క్షేత్రంగా ఆవిర్భవించింది. అపార చమురు, సహజవాయు నిక్షేపాలు ఈ క్షేత్రంలో ఉన్నాయని అంచనా వేశారు. అందుకే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తొలిసారిగా ప్రైవేటు భాగస్వామ్యంతో ఉత్పత్తిని ప్రారంభించారు. మొత్తం నాలుగు బావుల్లో ఒక పాత బావిని పునరుద్ధరించారు. కొత్తగా మూడు బావులు సిద్ధమవుతున్నాయి. కొత్త బావులు 2019 మార్చి నెలాఖరుకు ఉత్పత్తికి సిద్ధం కానున్నాయి. ఈ మూడు బావుల ద్వారా రోజుకు 450 క్యూబిక్ మీటర్ల చమురు, 1.50 లక్షల స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సహజవాయు ఉత్పత్తికానుంది. ఈ ప్రాజెక్టును ఓఎన్జీసీ రూ.407 కోట్లతో చేపట్టింది. ఇందులో 51 శాతం వాటా ఓఎన్జీసీది కాగా 49 శాతం వేదాంత కంపెనీది. ఈ బావులను తీవ్రమైన వత్తిడి కలిగిన బావులుగా గుర్తించారు. అత్యాధునిక రిగ్గులను వినియోగిస్తున్నారు. టైపు-3 అంతర్జాతీయ స్థాయి రిగ్గు, జాన్-16 అనే రిగ్గులను వినియోగిస్తున్నారు. 4500 మీటర్ల నుంచి 4600 మీటర్ల లోతు వరకు తవ్వకాలు చేయగల ఈ రిగ్గులను ఉపయోగించి చమురు, సహజవాయు నిక్షేపాలను వెలికి తీసేందుకు అంతా సిద్ధమైంది. ఈ బావి నుంచి చమురును ట్యాంకర్ల ద్వారా సూరసేన యానాంలోని కెయిర్న్ ఎనర్జీ రిఫైనరీకి తరలించనున్నారు. అదే విధంగా సహజవాయువును మెగా ఇంజనీరింగ్, రాక్ సిరమిక్స్, సెంటినీ శానిటరీ వేర్ సంస్థలకు కేటాయించడానికి ప్రాథమికంగా చర్యలు చేపట్టారు.
ఇదిలావుండగా ఓఎన్జీసీ రాజమహేంద్రవరం అసెట్ పరిధిలో 2016-17లో ఉత్పత్తి పెంపుదల 10.5 శాతం వుంటే, 2017-18లో 16.5 శాతానికి పెరిగింది. అదే విధంగా అసెట్ పరిధిలో రోజుకు మూడు మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేయాలనేది లక్ష్యం కాగా, ప్రస్తుతం లక్ష్యాన్ని మించి రోజుకు 3.5 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి సాధించింది. 2017-18లో రాష్ట్రానికి రూ.400 కోట్లు పన్నుల రూపంలో చెల్లించింది. అదే విధంగా రూ.18 కోట్లు సామాజిక బాధ్యత కింద ఖర్చుచేసినట్టు ఓఎన్జీసీ ఉన్నతాధికారులు తెలిపారు.