రాష్ట్రీయం

పట్టం కడితే ఉచిత విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, మే 8: చేతివృత్తులపై ఆధారపడి జీవించే నారుూబ్రాహ్మణులకు అండగా ఉంటామని ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం కల్వపూడి అగ్రహారంలో నారుూబ్రాహ్మణ సంఘీయులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని నారుూబ్రాహ్మణులకు 250యూనిట్ల లోపు విద్యుత్‌ను ఉచితంగా ఇస్తామన్నారు. 500యూనిట్ల వరకు వినియోగించే వారికి గృహావసరాల ధరనే వసూలు చేస్తామన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నారుూబ్రాహ్మణ, వడ్డెర, రజక తదితర బీసీ కులాలకు ప్రథమ ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. అనంతరం మల్లాయిపాలెం, చౌటపల్లి, పర్నాస తదితర గ్రామాల మీదుగా ముదినేపల్లి చేరుకున్నారు. ఈ సందర్భంగా జగన్‌కు పలువురు వినతిపత్రాలను అందజేశారు.
మల్లాయిపాలెంలో ముస్లిం మహిళలు పలు సమస్యలను జగన్ దృష్టికి తీసుకువచ్చారు. వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, నారుూబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ యానాదయ్య, కార్యదర్శి రావులకొల్లు నాగమల్లేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు రావులకొల్లు సుబ్రహ్మణ్యేశ్వరరావు, కౌన్సిలర్ రావులకొల్లు హైమావతి తదితరులు పాల్గొన్నారు.