రాష్ట్రీయం

మెరుగుకు పదును

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* రాష్ట్రాన్ని నెంబర్-1గా తీర్చిదిద్దాలి కాలానుగుణంగా విజన్ మారాలి
* ప్రజలకు మరింత చేరువ కావాలి జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి నిర్దేశం ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు
విజయవాడ, మే 8: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపేలా, రాష్ట్రంలో అందరినీ ఆనందంగా ఉంచేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఎంతో ఉందని జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఎప్పటికప్పుడు కాలానుగుణంగా విజన్‌ను మార్పు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లు, అధికారులను కోరారు. ఇప్పటి వరకూ ఎంతో బాగా పనిచేసినా, సూక్ష్మస్థాయిలో పనితీరు ఇంకా మెరుగుపరచుకోవాల్సి ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ విషయంలో రెండు రోజుల కలెక్టర్ల సమావేశం మరింత స్పష్టత తెస్తుందని ఆశిస్తున్నామన్నారు. మంగళవారం ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాల్‌లో జరిగిన జిల్లా కలెక్టర్ల 16వ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ల సమావేశం నిర్వహించుకుంటున్నామని పేర్కొన్న ముఖ్యమంత్రి, ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సమీక్షించుకుని, వాటి ఆధారంగా పాలన సాగిస్తున్నామని చెప్పారు. జూన్ 2 నవ్యాంధ్రప్రదేశ్‌లో పాలనకు నాలుగేళ్లు నిండుతున్నాయని, ఆరోజు నవనిర్మాణ దీక్షను అందరిలో స్ఫూర్తి కలిగించేలా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 47 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, రానున్న రోజుల్లో అర్హత కలిగిన మరో 5లక్షల మందికి పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. కుటుంబ సభ్యుల మరణం కారణంగా అభద్రతతో ఏ కుటుంబం కుప్పకూలిపోకుండా ‘చంద్రన్న బీమా’ కింద రూ.5లక్షలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

కృష్ణా డెల్టాకు 200 టీఎంసీలు
పట్టిసీమ నుంచి 130 టీఎంసీల వరకు నీటికి కృష్ణాడెల్టాకు తీసుకువచ్చామని, ఈ ఏడాది 200 టీఎంసీలు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. సూక్ష్మసేద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, ప్రతి ఏడాది రెండున్నర లక్షల ఎకరాల్లో అదనంగా సూక్ష్మ సేద్యం సాగు చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు.
విద్యారంగంలోనూ ప్రగతి సాధిస్తున్నామని, ఈ ఏడాది 6వేల తరగతి గదుల్లో వర్చువల్ క్లాస్ రూములు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంతి చెప్పారు. ర్యాంకింగ్, అక్రిడేషన్‌లోనూ విశ్వవిద్యాలయాలు చోటు దక్కించుకుంటున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఐఐటీలో 12 శాతం మన పిల్లలకు ర్యాంకులు వచ్చాయని, ఇది మనకు

గర్వకారణంగా ఉందన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొల్పుతున్న పరిశ్రమలతో 11 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేందుకు అవకాశం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఎంఎస్‌ఎంఈ యూనిట్లు నెలకొల్పేలా ప్రోత్సహించాలని కలెక్టర్లకు చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ యూనిట్లు నెలకొల్పేలా ప్రోత్సహించేలా కృషి జరగాలని నిర్దేశించారు. యువతలో నైపుణ్యాభివృద్ధి పెంచడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతమవుతాయన్నారు.
మనకు అన్యాయం జరిగింది
‘విభజనలో మనకు అన్యాయం జరిగింది. ఎక్కడో ఉండాల్సిన వాళ్లం కింది వరుసకు వచ్చాం. విభజనతో సమస్యల్లో ఉన్నామనుకుంటే కేంద్రం సహకరించటం లేదు. జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ఆనాడు ఎన్నికల ముందు పొత్తులు పెట్టుకున్నాం. మనకిచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టే కేంద్రంతో విభేదించాం. మనం గట్టిగా అడగకపోతే ఇంకా నష్టపోతామనే ప్రశ్నిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి అన్నారు. జనాభా నియంత్రణకు నాడు తన హయాంలో తీసుకున్న చర్యలతో మంచి ఫలితాలు సాధించామని, జనాభా నియంత్రణలో కేరళతో పోటీ పడ్డామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రభుత్వం జనాభా నియంత్రణ నుంచి జనాభా లెక్కలు పరిగణనలోకి తీసుకుంటే ఇంకా నష్టపోతామని అన్నారు. 14వ ఆర్థిక సంఘం కూడా 1971 జనాభా ప్రాతిపదికగా తీసుకుందని చెప్పారు. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే, పార్లమెంటు సీట్లు కూడా దక్షిణ భారతదేశంలో తగ్గిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఇది ప్రగతి శీల రాష్ట్రాలకు అన్యాయం చేసినట్టే అవుతుందన్నారు. అటు విభజన వల్ల ఇటు 15వ ఆర్ధిక సంఘం విధి విధానాల వల్ల మనం తీవ్రంగా నష్టపోతామని తెలిపారు.