రాష్ట్రీయం

అందులో ఏముందో ఏమిటో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: రాష్ట్రప్రభుత్వం ఫైనల్ మాస్టర్‌ప్లాన్‌లో రాజధాని రైతులు కోరిన విధంగా మార్పులు, చేర్పులు చేపట్టి రూపొందించినట్లు మంత్రి నారాయణ ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం 29 గ్రామాల రైతులు ఇంటర్నెట్‌కు అతుక్కుపోయారు. సిఆర్‌డిఎ వెబ్‌సైట్‌లో మాస్టర్‌ప్లాన్ అప్‌లోడ్ చేసి ఉంటారని భావించిన రైతులు క్షుణ్ణంగా పరిశీలించారు. మాస్టర్‌ప్లాన్ ఆనవాళ్లు ఇంటర్నేట్‌లో కనిపించక పోవటంతో కొందరు రైతులు హుటాహుటిన విజయవాడ సిఆర్‌డిఎ ప్రధాన కార్యాయాన్ని ఆశ్రయించగా, మరికొందరు తుళ్లూరు ప్రాంతీయ కార్యాలయం వద్దకు వెళ్లి సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఫైనల్ మాస్టర్‌ప్లాన్‌లో మరి కొన్ని మార్పులు చేయాల్సి ఉన్న దృష్ట్యా రెండు రోజుల వరకు రైతుల ముందుకు వచ్చే అవకాశం లేదని విజయవాడ సిఆర్‌డిఎ అధికారులు వెల్లడించారని రైతులు చెబుతున్నారు. రాష్ట్రప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మాస్టర్‌ప్లాన్ 29 గ్రామాల్లో ప్రకంపనలు సృష్టించింది. దీంతో మంత్రుల ఎదుట ప్రజలు తమ అభ్యంతరాలను తీవ్రంగా వ్యక్తం చేశారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం రైతులు సిఆర్‌డిఎ అధికారులను, మంత్రులను ఒత్తిడి చేయటంతో అప్పటికప్పుడు మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేపట్టారు. గ్రామంలో ఉన్న అంతర్గత రహదారిని మార్పు చేస్తూ మాస్టర్‌ప్లాన్‌లో మార్పు చేసి చూపించిన తరువాతనే రైతులు శాంతించారు. అయితే ఫైనల్ మాస్టర్‌ప్లాన్ చూసిన తరువాతనే తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తామని రైతులు చెబుతున్నారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ గతంలో 3,600 గృహాలను తొలగించాల్సిన పరిస్థితి ఉందని, రైతుల నుంచి పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తమైన కారణంగా కేవలం 360 నుంచి 400 గృహాలు మాత్రమే తొలగించే విధంగా మార్పులు చేసినట్లు ప్రకటించారు. రైతులు మాత్రం స్వయంగా మాస్టర్‌ప్లాన్ చూసిన తరువాత మాత్రమే స్పందిస్తామంటున్నారు. గతంలో 6 గ్రామాల్లో గృహాలను తొలగించాల్సి పరిస్థితి ఉండగా, ప్రస్తుతం మూడు గ్రామాలకు మాత్రమే పరిమితం చేసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. తుళ్లూరు, ఐనవోలు, నేలపాడు గ్రామాల్లో మాత్రమే గృహాలు తొలగించాల్సిన పరిస్థితి ఉందని, మిగిలిన గ్రామాల్లో యథాతథంగా ఉంటాయని పేర్కొంటున్నారు. కేంద్రరాజధాని ప్రాంతమైన ఉద్దండరాయునిపాలెం, తాళ్లాయిపాలెంలో మాస్టర్‌ప్లాన్ చూసిన తరువాత మాత్రమే అర్థమవుతుందని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు.