రాష్ట్రీయం

గుండ్లపోచంపల్లిలో వస్త్ర పరిశ్రమకే చాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 8: గుండ్లపోచంపల్లి పార్క్‌లో వస్త్ర పరిశ్రమలు తప్ప ఇతర వాటికి అనుమతులు రద్దు చేయాల్సిందిగా చేనేత మంత్రి కె తారకరామారావు ఆదేశించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో మంగళవారం గుండ్లపోచంపల్లి, పాశమైలారం పార్క్‌లపై సంబంధిత శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్‌ఐఐసి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పార్క్‌లో తెలంగాణలోని వివిధ హ్యాండీక్రాప్ట్ కళాకారులకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే వౌలిక సదుపాయాలు, పార్క్‌ల నిర్వహణకు అవసరమైన కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు. పాశమైలారం టెక్స్‌టైల్ పార్క్‌కు మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ ఏడాది బతుకమ్మ చీరల పంపిణీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన చీరలన్నింటినీ సెప్టెంబర్ మూడవ వారం వరకే సిద్ధం చేస్తామన్నారు. ఇప్పటికే చీరల డిజైన్లు, నాణ్యతపై సెర్ప్ మహిళా సంఘాలతో చర్చించి ఖరారు చేశామన్నారు.