రాష్ట్రీయం

క్షేత్రస్థాయలో టెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* రైతు బంధు పథకానికి కౌంట్‌డౌన్ మరో 24 గంటల్లో చెక్కుల పంపిణీ
* హైదరాబాద్ మినహా 30 జిల్లాల్లో పండుగ ప్రజాప్రతినిధులందరికీ ఆహ్వానం
హైదరాబాద్, మే 8: రైతుబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా సీఎం కే. చంద్రశేఖరరావు చేపట్టడంతో గ్రామీణ ప్రాంతాల్లో గత ఆరునెలలుగా హడావుడి కనిపిస్తోంది. చెక్కుల పంపిణీకి గడువు సమీపించడంతో హడావుడి తారాస్థాయికి చేరింది. అయతే పథకాన్ని క్షేత్రస్థాయలో పర్యవేక్షించాల్సిన రెవెన్యూ, వ్యవసాయ శాఖలోని మండల, గ్రామస్థాయి సిబ్బంది టెన్షన్‌కు గురవుతున్నారు. రైతుబంధు పథకం మే 10న ప్రారంభం అవుతుండటంతో కార్యక్రమం నిర్వహణపై సిబ్బంది ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. దేశానికే ఆదర్శంగా నిలవబోతున్న రైతుబంధు కార్యక్రమం ఏవిధంగా జరుగుతుందోనన్న అంశమే కిందిస్థాయి ఉద్యోగుల టెన్షన్‌కు కారణంగా కనిపిస్తోంది. ఈ కార్యక్రమం అమల్లో ఏ స్థాయిలో చిన్న తప్పు జరిగినా ప్రభుత్వం సీరియస్‌గా చర్యలు తీసుకుంటుందన్న భయం సిబ్బందిలో కనిపిస్తోంది. మే 10న రైతుబంధు ప్రారంభం అవుతుండటంతో రైతుబంధుకు కౌంట్ డౌన్ ప్రారంభమైనట్టే. ఈ వార్త చదివే సమయానికి సరిగ్గా 24 గంటల తర్వాత రైతుబంధు ప్రారంభం అవుతుంది. ఒకవైపు రైతులంతా ఆనందంగా ఉన్నప్పటికీ, కౌలురైతుల వల్ల ఏవైనా సమస్యలు వస్తాయేమనని సిబ్బంది భయపడుతున్నారు. అందుకే పట్టాదార్ పాస్‌పుస్తకాలు, రైతుబంధు చెక్కులు పంపిణీ చేసే కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలంటూ పోలీసు శాఖను రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు కోరారు. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అందిన సమాచారాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని గ్రామాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్ర డిజిపి మహేందర్‌రెడ్డి జిల్లాల ఎస్‌పిలకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్‌పిలు తమ తమ జిల్లాల్లో డిఎస్‌పిలు, సిఐలు, ఎస్‌ఐలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా అన్ని కేంద్రాల వద్ద మే 10 నుండి కార్యక్రమం పూర్తయ్యే వరకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు సంవత్సరం కాలం నుండి రైతుబంధు పథకంపై చర్చలు, సమీక్షలు, సమావేశాలు విస్తృతంగా జరిగాయి. పంటలకోసం రైతులు పెట్టే పెట్టుబడికి సాయం చేయాలని భావించిన ముఖ్యమంత్రి అన్ని వర్గాలతో చర్చలు జరిపి రైతుబంధు పథకానికి ‘శ్రీకారం’ చుట్టారు. ఏడాది క్రితమే ఆలోచన వచ్చినప్పటికీ, ఈ పథకం శాస్ర్తియ విధానంలో చేపట్టేందుకు వివిధ వర్గాల అభిప్రాయాలు తీసుకుని సమగ్ర ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రణాళిక పట్ల జాతీయ స్థాయిలో కూడా చర్చ మొదలైంది.
ఉపముఖ్యమంత్రి సమీక్ష
ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ సచివాలయంలో రైతుబుంధుపై ఉన్నతాధికారులతో చర్చించారు. తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, 140.20 ఎకరాలకు సంబంధించి58.06 లక్షల మంది రైతులకు పాస్‌పుస్తకాలు, చెక్కులు ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు స్వయంగా ఈ నెల 10 న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం ధర్మరాజుపల్లి (ఇందిరానగర్) లో ప్రారంభిస్తారని వివరించారు. మహమూద్‌తో పాటు రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.