రాష్ట్రీయం

డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల వ్యవహారం దోస్త్ నోటిఫికేషన్ జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 8: తెలంగాణలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ‘దోస్త్’ కౌనె్సలింగ్ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కౌనె్సలింగ్ షెడ్యూలు, అందుకు చేపట్టిన సాంకేతిక ఏర్పాట్లను వివరించారు. రాష్టవ్య్రాప్తంగా 1173 డిగ్రీ కాలేజీల్లో వివిధ గ్రూపులలో ఇంటర్ మార్కుల ఆధారంగా అడ్మిషన్లు చేపడతామని, ఇందుకు అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కాలేజీలకు వెళ్లి నేరుగా అడ్మిషన్ పొందే విధానం ఇపుడు లేదని, దోస్తు ద్వారా అడ్మిషన్ పొందాలని సూచించారు. డిగ్రీ కాలేజీల్లో ఉన్న సీట్ల భర్తీ ప్రక్రియను మూడు దశల్లో నిర్వహిస్తామని, ఇంకా సీట్లు మిగిలితే వాటికి సంబంధించి చివరి దశలో ప్రత్యేక కౌనె్సలింగ్ అంశం ఆలోచిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం 4.21 లక్షల సీట్లు ఉన్నాయని, ఎవరికీ సీటు రాని పరిస్థితి లేదని అన్నారు. తొలి దశ షెడ్యూలు నోటిఫికేషన్ విడుదల చేశామని, 10 నుండి 26 వరకూ రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లు ఉంటాయని, 400 రూపాయల అదనపు రుసుంతో 29 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎన్‌సిసి, స్పోర్ట్సు, గేమ్స్ వంటి స్పెషల్ కేటగిరి అభ్యర్ధులకు ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్ సెంటర్లలో సర్ట్ఫికేట్ల పరిశీలన జరుగుతుందన్నారు. తొలి దశ సీట్లను జూన్ 4న ప్రకటిస్తామని చెప్పారు. సాధారణ అభ్యర్థులు హెల్ప్‌లైన్ సెంటర్లకు వెళ్లనక్కర్లేదని, ఇప్పటికే ఆధార్‌తో అనుసంథానమైన టెలిఫోన్ నెంబర్‌ను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ఒటిపి నిర్థారణ ద్వారా సర్ట్ఫికేట్ల పరిశీలన నిర్వహించుకోవచ్చన్నారు.

జూన్ 5 నుంచి రెండో దశ
జూన్ 5 నుండి రెండో దశ అడ్మిషన్ల కౌనె్సలింగ్ జరుగుతుందని, వారందరికీ జూన్ 19న సీట్ల కేటాయింపు చేస్తామని అన్నారు. విద్యార్థులు సంబంధిత కాలేజీలకు జూన్ 25లోగా వెళ్లి రిపోర్టు చేయాలని సూచించారు. మూడోదశ రిజిస్ట్రేషన్ జూన్ 20 నుండి మొదలవుతుందని, అదే సమయంలో ఫ్రెష్ అభ్యర్ధులు కూడా తమ పేరును రిజిస్టర్ చేసుకోవచ్చని అన్నారు. మూడోదశ కౌనె్సలింగ్ సీట్ల కేటాయింపు జూన్ 30న జరుగుతుందని, అందులో సీట్లు పొందిన వారు జూలై 4వ తేదీలోగా రిపోర్టు చేయాలని అన్నారు. ఇంకా సీట్లు మిగిలి ఉంటే జూలై 5 నుండి సంబంధిత కాలేజీల్లో స్లయిడింగ్ నిర్వహించుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని ఐదు యూనివర్శిటీల పరిధిలో 74 హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అభ్యర్ధులు అక్కడికి వెళ్లకుండానే రిజిస్టర్డు మొబైల్ నెంబర్ ద్వారా సర్ట్ఫికేట్ల పరిశీలన జరుపుకోవచ్చని అధికారులు సూచించారు.