రాష్ట్రీయం

కేంద్రంపై యుద్ధం తప్పదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మే 9: ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. గురువారం కర్నూలులో పర్యటించనున్న సీఎం మేధావుల సదస్సులో పాల్గొని ప్రత్యేక హోదా అంశంపై వారితో చర్చించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్చంద సంస్థలు, విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. సుమారు మూడు గంటల పాటు కొనసాగే ఈ సదస్సులో చంద్రబాబు ఏం చెప్పనున్నారన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న విభేదాలు, ముగిసిపోయిందనుకున్న ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి రావడంతో మేధావుల సదస్సుకు ప్రాధాన్యత ఏర్పడింది. దేశంలో బీజేపీపై వ్యతిరేకత పెరగడానికి చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరే కారణంగా భావిస్తున్న ఆ పార్టీ పెద్దలు వేస్తున్న అడుగులు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవలి కాలంలో చంద్రబాబును జగన్, పవన్‌కళ్యాణ్ సరైన రీతిలో ఎదుర్కోలేకపోతున్నారన్న ఉద్దేశంతో ఓటుకు నోటు కేసును తెరపైకి తెచ్చి ఉంటారన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ కేసు కోర్టులో విచారణలో ఉన్న సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించడం వెనుక కారణాలు ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే ప్రత్యేక హోదాపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన చంద్రబాబు పట్ల కేంద్రం కఠినంగా వ్యవహరించి ఏ మేరకు లబ్ధి పొందుతుందన్న ప్రశ్న రాజకీయ విశే్లషకుల నుంచి ఎదురవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ చంద్రబాబుపై ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నా అవి ఆయనకు అనుకూలంగా మారే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత లేదంటున్నారు. ఓటర్లకు రాజకీయ పార్టీలు ఇస్తున్న సొమ్మును గుర్తుచేసుకుంటూ ఇది కూడా అలాంటిదేనన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని పేర్కొంటున్నారు. అలాంటి కేసును తెరపైకి తీసుకువచ్చి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసి సత్ఫలితాలను పొందుతారా అని విశే్లషకులు ఎదురు ప్రశ్న వేస్తున్నారు. ఆపరేషన్ గరుడ పేరుతో రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి, చంద్రబాబును వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని ఎదుర్కోడానికి కోట్ల రూపాయలను బీజేపీ నీళ్లలా ఖర్చుచేస్తోందని సినీనటుడు శివాజీ చేస్తున్న ఆరోపణలు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో చంద్రబాబుపై కేంద్రం కఠిన వైఖరి అవలంబించి ప్రయోజనం పొందుతుందా అన్నది వేచి చూడాలి. ఈ ప్రశ్నలు, అనుమానాల క్రమంలో కర్నూలులో గురువారం నిర్వహించే మేధావుల సదస్సులో చంద్రబాబు తాను భవిష్యత్తులో అనుసరించే వైఖరిపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముంది. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతారా? లేదంటే దూకుడు తగ్గించి కేంద్రానికి తలొంచనున్నారో తేలుతుందని వారంటున్నారు.