రాష్ట్రీయం

నీటి తీరువాకు చెల్లుచీటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్, మే 9: రైతుబంధు పథకంలో ఎకరాకు 4 వేల రూపాయల చెక్కుతోపాటు పట్టాదారు పుస్తకాలు అందజేయడానికి ఒకరోజు ముందు రైతన్నలకు ప్రభుత్వం మరో తీపి కబురు ప్రకటించింది. 800 కోట్ల రూపాయల భూమి శిస్తు బకాయిల మాఫీని ప్రకటించింది. అలాగే, ఇకనుండి భూమి శిస్తు వసూలు చేయమని, నీటి వనరుల నిర్వహణ ప్రభుత్వమే చేపడుతుందని మెదక్ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. బుధవారం సాయంత్రం మెదక్ జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయం, ఎస్పీ కార్యాలయాలకు సీఎం చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేశారు. అనంతరం సిఎస్‌ఐ గ్రౌండ్‌లో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అధ్యక్షతన రాత్రి జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రైతులకుభూమిశిస్తు బకాయిల రద్దుతోపాటు దేశ రాజకీయాలపై మాట్లాడారు. గతంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి రైతులకు సంబంధించిన భూమిశిస్తు విషయం గురించి తన దృష్టికి తెచ్చారన్నారు. రైతులకోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నందున 700 నుంచి 800 కోట్ల రూపాయలు భూమిశిస్తు (నీటితీరువా) బకాయిల మాఫీని మెదక్ సభ నుండి ప్రకటిస్తున్నానన్నారు. ఇక నుండి భూమిశిస్తు వసూలు చేసేది లేదని వెల్లడించారు. భవిష్యత్తులో రైతులకు ఎలాంటి బాధలు ఉండకుండా ఉచితంగా సాగునీటి సరఫరా జరుగుతుందన్నారు. ఇటీవల దేశ రాజకీయాలపై దృష్టిసారించిన సీఎం చంద్రశేఖర్‌రావు, ఆ దిశగా వెళ్లేందుకు తనకు సంపూర్ణ సహకారం అందించాలని చప్పట్లతో ప్రజల మద్దతు పొందారు. నాలుగేళ్ల కాలంలోనే దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఆవిష్కృతమైందన్నారు. 20 శాతం వృద్ధిరేటుతో రాష్ట్రం ముందున్నామన్నారు. 70 ఏళ్ల కాంగ్రెస్, బీజేపీల పాలన అట్టర్‌ఫ్లాప్‌గా అభివర్ణించారు. దళిత, బడుగు, బలహీన వర్గాలు అసంతృప్తితో ఉన్నాయన్నారు. దేశానికి ప్రకృతి చాలా ఇచ్చినా మనం వాటిని సరైన రీతిలో వాడుకోవడం లేదని ఆవేదన వ్యకతం చేశారు. దేశంలో 70 వేల టీఎంసి నీరుంటే, కేవలం 40 వేల టీఎంసీ నీటితో 40 కోట్ల ఎకరాల భూమికి సాగునీరు, తాగునీటి అవసరాలు తీర్చుకోవచ్చన్నారు. 30 వేల టీఎంసీ మిగులు జలాలను పరిశ్రమలు ఇతర అవసరాలకు వాడుకోవచ్చని కేసీఆర్ వివరించారు. కానీ నేటికీ దేశంలో సాగు, తాగుకు నీటి వనరులు లేవన్నారు. ఇలా దేశంలో అనేక విషయాలపట్ల అధ్యయనం చేసి జాతీయస్థాయిలో క్రియాశీలకపాత్ర పోషించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాల రహదారులు లేవన్నారు. చైనాలో లక్షా 23 వేల కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్ వేలుంటే మన దేశంలో కేవలం 2 వేల కిలోమీటర్లు మాత్రమే ఉన్నాయన్నారు. దేశంలో అన్ని రహదారులు 4, 6 లేన్‌లుగా మారాల్సిన అవసరం ఉందన్నారు. కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులతో చైతన్యానికి మారుపేరైన మెదక్ జిల్లా బిడ్డగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకుతీసుకెళ్లి రాష్ట్రాన్ని సాధించాం. అలాగే మీ చప్పట్లతో ఆశీర్వదించాలని ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరడంతో ప్రజలు పెద్దపెట్టున హర్షధ్వానాలు ప్రకటించారు. సభలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, ఎంపిలు ప్రభాకర్‌రెడ్డి, బిబి పాటిల్, సంతోష్‌కుమార్‌రావు, శాసనమండలి విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.