రాష్ట్రీయం

* ప్యాకెట్లుగా చెత్త సేకరణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మే 9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నగరాలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలను చెత్త సేకరణ కోసం పాకెట్ల వారీ విభజన చేస్తున్నారు. ఈ విధానం ద్వారా ప్రతీ ఇంటికీ చెత్త సేకరణ జరిగిందా లేదా అన్న చాలా స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు సేకరించిన చెత్తను కూడా తూకం వేస్తారు. తద్వారా ఇంటింటికీ చెత్త సేకరణ ఏ విధంగా జరిగిందో నిర్ధారణ అవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 110 పురపాలక సంఘాల్లో ప్రతీ ఇంటికీ రియల్ టైం మానిటరింగ్ సిస్టం (ఆర్‌టిఎంఎస్) ట్యాగ్‌లను ఏర్పాటుచేస్తున్నారు. అదే విధంగా ఆయా పురపాలక సంఘంలోని శానిటరీ డివిజన్ల వారీగా పాకెట్లుగా విభజిస్తున్నారు. వార్డు, వీధి, కుటుంబాలను పరిగణనలోకి తీసుకుని ప్రతీ 350 కుటుంబాలను ఒక పాకెట్‌గా విభజిస్తారు. ఈ పాకెట్‌లో ఉన్న 350 కుటుంబాలకు ఒక పుష్‌కార్ట్ అందిస్తారు. ఆ పుష్‌కార్టుకి ఇద్దరు పారిశుద్ధ్య సిబ్బందిని నియమిస్తారు. వీరిరువురూ ఆ 350 కుటుంబాలకు చెందిన చెత్తను ప్రతీ రోజు ఇంటింటికి వెళ్ళి సేకరించాలి. ఇది ఉదయానే్న జరగాలి. చెత్త సేకరించేన సమయంలో ఆర్‌టిఎంఎస్ ట్యాగ్‌ను పుష్‌కార్టర్ వద్ద ఉన్న స్కానర్ ద్వారా స్కాన్ చేస్తారు. తద్వారా వచ్చిన బీప్ శబ్దం ద్వారా శానిటరీ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ కమిషనర్, కమిషనర్ వరకు ఆ ఇంటి నుంచి చెత్తసేకరణ చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ స్కాన్‌చేసినా చెత్త సేకరణ జరగకుండా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇందుకోసం ఆ పాకెట్‌లో ఉన్న 350 కుటుంబాలకు చెందిన చెత్తను తూకం వేస్తారు. అప్పుడే నిర్ధారణ చేసుకోవచ్చు. దీంతో పాటు డ్రైనేజీని పరిశుభ్రం చేయడం, రోడ్లు ఊడ్చటం, దోమల నివారణకు పిచికారీ చేయడం ఇలా మున్సిపాల్టీ పారిశుద్ధ్య విభాగం ద్వారా అందించే సేవలన్నీ వీరు అందిస్తారు. ఇప్పటికే పాకెట్లుగా ఎంపికచేసిన కుటుంబాలకు వీధుల నుంచి, గేటు నుంచి సంఖ్యను కూడా ఇచ్చారు. ఆ సంఖ్యకు అనుగుణంగా ట్యాగింగ్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 270లో భాగంగా చెత్త సేకరణకు జవాబుదారీతనం ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇదిలా ఉండగా ఇప్పటికే 40 పురపాలక సంఘాల్లో జీవో 270ని అమలుచేస్తూ ఆన్‌లైన్ టెండర్లను పిలిచారు. సుమారు 40 పురపాలక సంఘాల్లో టెండర్లను కాంట్రాక్టర్లు అమలుచేసేందుకు అన్ని ఏర్పాట్లుచేస్తున్నారు. మిగిలిన 70 మున్సిపాల్టీల్లోనూ ఈ పనులు ఇంకా టెండర్ల దశలోనే ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి జీవో 279ని పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు.