రాష్ట్రీయం

ప్రజల్లోకి వెళ్లండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కలెక్టర్లతో సమన్వయం కావాలి * దర్యాప్తు సమర్థత పెంచుకోవాలి
విజయవాడ (క్రైం), మే 9: ఎక్కడో కూర్చొని పాలన చేస్తామంటే కుదరదు. ప్రజల్లోకి వెళ్లి వారితో మమేకమవ్వాలి. వారి సహకారంతోనే నేరాలను నియంత్రించవచ్చని పోలీసు అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో బుధవారం రాత్రి అన్ని జిల్లాల ఎస్పీలతో సమావేశమై పోలీస్ శాఖను సమీక్షించారు. పోలీసు వ్యవస్థ పటిష్ఠంగా ఉంటేనే రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడిలో ఉంటాయన్నారు. సమావేశంలో పక్కపక్కనే కూర్చోవడం కాదని, జిల్లాల్లో వారానికి ఒకసారి కలుసుకుని సమన్వయం చేసుకోవాలని ఎస్పీలకు ఉద్బోధించారు. అసాంఘిక శక్తుల చేతుల్లో అక్రమధనం వచ్చి చేరడం వల్ల సమాజానికి ఎక్కడలేని చేటు జరుగుతోందన్నారు. ఇప్పటి వరకు 16సార్లు త్రైమాసిక సమీక్షలు జరుపుకున్నా.. ఆశించిన మేర ఫలితాలు రావడం లేదని పోలీసు శాఖపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకనుంచి నెలకోసారి క్రైం బులిటెన్ విధిగా విడుదల చేయాలని ఆదేశించారు. నేరగాళ్ళు టెక్నాలజీని వాడుకుంటూ చెలరేగిపోతున్నారన్నారు. పెరిగిపోతున్న నీచ నేరాలను నియంత్రించాల్సిన అవసరముందని గుంటూరు జిల్లా దాచేపల్లి అత్యాచార ఘటనను ఉదహరించారు. పోలీసుశాఖ న్యాయం చేస్తుందనే నమ్మకం, విశ్వాసం ప్రజలకు కల్పించాలని, విజుబుల్ పోలీసింగ్ అసరమన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే లా అండ్ ఆర్డర్ పటిష్ఠంగా ఉండాలన్నారు. భద్రత, రక్షణ ఉంటే సమాజం సంతోషంగా ఉంటుందని, ఇంటి నుంచి బయటకు వచ్చిన వ్యక్తి క్షేమంగా తిరిగి చేరుకుంటారనే నమ్మకం ప్రజల్లో లోపించినప్పుడు అశాంతి చోటు చేసుకుని ఆందోళనలు చెలరేగే ప్రమాదం ఉంటుందన్నారు. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు, కరవు, తుపాన్లు వచ్చినప్పుడు, ప్రభుత్వాలు బలహీనంగా ఉన్నప్పుడు తీవ్రవాద, కుల మత సమస్యలు ఉత్పన్నమై లా అండ్ ఆర్డర్ గాడి తప్పుతుందన్నారు. ఎదురయ్యే ఒక సమస్య మరో సమస్యను సృష్టిస్తుందని, అట్టి పరిస్ధితులను ఎదుర్కోవాలంటే పోలీసు వ్యవస్థ పటిష్ఠంగా పని చేయాలన్నారు. ఇందుకోసం ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని పోలీసుశాఖకు సూచించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కలిసి సమన్వయంతో పని చేయాలని, ప్రజల్లో మమేకమై వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. బాధితుడు సులువుగా పోలీసుల వద్దకు వచ్చే పరిస్ధితి కల్పించాలన్నారు. నేరస్థులే హీరోలుగా చలామణి అయ్యే స్ధితి రాకుండా పబ్లిక్‌ప్రాసిక్యూటర్లతో సమన్వయం చేసుకుని నేరగాళ్ళకు శిక్షలు పడేలా కృషి చేస్తే మరొకరు తప్పు చేసేందుకు భయపడతారన్నారు. శిక్షా శాతం పెంచాలని, ప్రభుత్వ న్యాయవాదులు, దర్యాప్తు అధికారుల సమర్థత పెంచుకోవాలని సూచించారు. గడిచిన నాలుగేళ్ళలో కరవును నియంత్రించగలిగామని చెప్పారు. ప్రజలను ఆకర్షించి డబ్బులు దండుకునే బోగస్ కంపెనీలు వస్తున్నాయని అగ్రిగోల్డ్‌ను ఉదహరించారు. అదేవిధంగా ఎర్రచందనం స్మగ్లింగ్‌లో చైనావరకు స్మగ్లింగ్ కారిడార్‌గా మారిందని, అయితే ఆ పరిస్ధితిని నియంత్రించి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం ద్వారా రెడ్‌శాండిల్ సమస్యను నియంత్రించామన్నారు. తద్వారా ఏడాదికి నాలుగు సార్లు వేలం వేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీనిలో భాగంగా తాజాగా మూడో వేలంలో సుమారు వంద కోట్ల ఆదాయం వస్తుందన్నారు. అదే ప్రైవేటు వ్యక్తుల వద్ద అక్రమ ధనం ఉంటే వారి చర్యల వల్ల సమాజానికి అశాంతి కలుగుతుందన్నారు. బెట్టింగ్‌లు కూడా ఈ కోవకు చెందిన నేరాలేనన్నారు. కొత్తగా పుట్టుకొస్తున్న నేరాల్లో భాగంగా బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని, పరిచయమున్న వ్యక్తులే నీచమైన నేరాలకు పాల్పడుతున్నారని, దాచేపల్లి, విజయనగరం ఘటనలను ఉదహరించారు. నేరగాళ్ళు టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారని, అప్లికేషన్‌లు డౌన్‌లోడు చేసుకుని కొత్తనేరాలకు పాల్పడుతున్నారని, మరోవైపు అశ్లీల దృశ్యాలు కూడా చేటు కలుగచేస్తున్నాయన్నారు. వీటన్నింటిని అధిగమించి జిల్లాల ఎస్పీలు, పోలీసుశాఖ సమర్థవంతంగా పని చేసేందుకు గడిచిన మూడు మాసాల్లో జరిగిన నేరాలు, భవిష్యత్తులు జరిగే కొత్త తరహా నేరాలను అంచనా వేసి ప్రణాళికాబద్ధంగా పని చేయాలని సూచించారు. అనంతరం డీజీపీ మాలకొండయ్య ఈ మూడు మాసాల క్రైం రేటుకు సంబంధించి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనంతరం జిల్లాల వారీగా ఎస్పీలతో సీఎం సమీక్షించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, హోం మంత్రి చినరాజప్ప, చీఫ్ సెక్రటరీ దినేష్‌కుమార్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనురాధ, ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు, సిఐడి డీజీ ద్వారకాతిరుమలరావు, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.