రాష్ట్రీయం

మీ సహకారంతోనే అద్భుతాలు సాధించాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు
విజయవాడ, మే 9: సంక్షోభంలోనూ జట్టుగా పనిచేసి దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు సాధించిన ఫలితాల్లో ప్రతి ఒక్కరికీ భాగస్వామ్యం ఉందన్నారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ల సదస్సులో రెండో రోజు బుధవారం సమావేశంలో మాట్లాడుతూ నూతన ఆలోచనల సృష్టికి, ఒకరిని చూసి ఒకరు నేర్చుకునేందుకు సమష్టిగా పనిచేయటం దోహదపడుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. నిరంతరం శ్రమతో విజయం సాధ్యమని, కొద్దిపాటి మనస్సు పెడితే అద్భుతాలు సాధించవచ్చన్నారు. అమరావతిని ఏరియల్ సర్వేలో పరిశీలించిన నార్మన్ పాస్టర్స్ సంస్థ ఇటువంటి నగరం ప్రపంచంలో మరెక్కడా రాదన్నారని తెలిపారు. భారతదేశంలో ఉత్తమ ఫలితాలు సాధించిన జట్టు తమదేనని కితాబిచ్చారు. నిధులు కొరత ఉన్నా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, ధనిక రాష్ట్రాలు సైతం అమలు చేయలేకపోతున్నాయని వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల విజయాల్లో గ్రామస్థాయి అధికారి నుంచి సీఎంఓలోని అధికారుల వరకు ప్రతి ఒక్కరి పాత్రా ఉందన్నారు. ఇప్పటికే ఒక స్థాయికి వచ్చామని, దానిని నిలుపుకుంటూ మరింత అభివృద్ధి సాధించేందుకు అందరం కష్టపడాలని పిలుపునిచ్చారు. ఒక జిల్లా విజయం సాధించాలన్నా, మంత్రి విజయం సాధించాలన్నా ఒక మంచి జట్టును ఏర్పాటు చేసుకోవాలన్నారు. జట్టును తయారు చేసుకోవటానికి ఓపిక అవసరమన్నారు. నాయకుడు నూరుశాతం ఫలితాలు సాధించాలంటే కింద ఉండే జట్టు చాలా ముఖ్యమన్నారు. సక్సెస్ ఇచ్చే కిక్ మరెందులోనూ రాదని చెప్పి సభలో నవ్వులు పూయించారు. 2029 కంటే ముందుగా దేశంలో ఏపీ నెంబర్ 1 అవుతుందని తన జట్టుని చూశాక నమ్మకం మరింత రెట్టింపైందని, సహకరించిన అందరికీ అభినందనలు తెలిపారు. సింగ్‌పూర్ జనాభా 50 లక్షలని, రాష్ట్ర జనాభా ఐదు కోట్లని మార్కెటింగ్ చేసుకునేందుకు దేశంలో 120 కోట్ల జనాభా ఉందన్నారు. ప్రపంచంలో ఇన్నోవేటర్స్ అందరూ ఏపీకి వచ్చేలా చూడాలని, వాళ్ల ఆవిష్కరణలకు రాష్ట్రం వేదిక కావాలని ఆకాంక్షించారు. ఇండియాలో ఇన్నోవేషన్ వ్యాలీ ఎక్కడుందంటే ఏపీనే గుర్తుకు రావాలని, ఆరోజు ఎంతోదూరం లేదన్నారు. ప్రతి శాఖ వినూత్న ఆవిష్కరణల గురించి ఆలోచించాలన్నారు. పరిష్కార వేదిక కాల్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్లు వినియోగించుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు వస్తే పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివిధ అంశాలపై ఉత్తమ సమాచారాన్ని ఆర్‌టీజీ ద్వారా ఎప్పటికప్పడు అందిస్తామని, దీనిని ఉపయోగించుకోవటం వలన మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. ఈ నెలలో ప్రజల సంతృప్తి స్థాయిని ఐదు శాతం పెంచాలంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో శిల్పారామాలు ఏర్పాటు చేయాలని, వాటి నిర్వహణ కూడా మెరుగ్గా ఉండాలన్నారు. ఇప్పటికే 9 జిల్లాలో చేపట్టిన శిల్పారామాల పనులను త్వరిగతిన పూర్తి చేయాలన్నారు. గోదావరి జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయని సీఎం తెలిపారు. అఖండ గోదావరి ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని పెంచాలని, చెత్తను సేకరించేందుకు ప్రస్తుతం వినియోగిస్తున్న వాహనాల స్థానంలో ఎలక్ట్రికల్ వాహనాలను ప్రవేశపెట్టాలని సూచించారు. పరిశ్రమ రంగ సమీక్షలో సీఎం మాట్లాడుతూ పరిశ్రమలకు భూ కేటాయింపులు త్వరితగతిన ఇవ్వాలన్నారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను భారీ ఎత్తున ప్రోత్సహించాలని తద్వారా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే వీలు కలుగుతుందన్నారు. నియోజకవర్గానికి ఒక ఎంఎస్‌ఎంఇ పార్కు ఏర్పాటు చేయాలన్నారు. ఆహార శుద్ధి రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లాల వారిగా స్థానికంగా పండే పంటలకు అనువుగా ఈ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. మే నెలాఖరు కల్లా పరిశ్రమలకు భూ కేటాయింపులు పూర్తి కావాలని ఆదేశించారు.