రాష్ట్రీయం

కాలుష్యానికి బ్యాటరీ చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 9: స్థానిక కంపెనీలతో కలిసి హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రాన్ని నెలకొల్పడానికి చైనాకు చెందిన బివైడి ఆటో ఇండస్ట్రీ కంపెనీ ముందుకొచ్చింది. హైదరాబాద్‌ను కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించనున్నట్టు ఈ సందర్భంగా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆర్టీసితో పాటు జిహెచ్‌ఎంసిలో క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశ పెట్టనున్నట్టు సీఎం ప్రకటించారు. ప్రగతి భవన్‌లో బుధవారం చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయరీ సంస్థ బివైడీ ఆటో ఇండస్ట్రీ కంపెనీ ప్రతినిధులు సీఎం కేసీఆర్‌ను కలిశారు. నూటికి నూరుశాతం బ్యాటరీతో నడిచే వాహనాల తయారీ పరిశ్రమను హైదరాబాద్‌లో నెలకొల్పడం చైనాకు వెలుపలి ఇదే తొలి యూనిట్‌గా బివైడీ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. బివైడీ కంపెనీ నెలకొల్పబోయే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారాన్ని అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. పట్టణాల్లో వాహనాలు వెదజల్లే కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని తగ్గించాలంటే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని క్రమంగా పెంచుతామన్నారు. మొదటి దశలోనే 500 వాహనాలు బివైడీ నుంచి కొనుగోలు చేస్తామని సీఎం ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకానికి ఎక్కువ అవకాశాలు, ఆవశ్యకత ఉందన్నారు. అంతకుముందు బివైడీ తయారు చేసిన ఎలక్ట్రిక్ బస్సులో సీఎం కొద్దిసేపు ప్రయాణం చేసి పరిశీలించారు. బస్సు నాణ్యతా ప్రమాణాలు బాగున్నాయని కితాబిచ్చారు. సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు కాలుష్యరహిత వాతావరణానికి ఎంతో అనువుగా ఉందన్నారు. ఒక్కసారి చార్జి చేస్తే 300 నుంచి 400 కిలోమీటర్ల వరకు ఎలక్ట్రిక్ వాహనంలో ప్రయాణం చేయవచ్చాన్నారు. బస్సులతో పాటు కార్లు, ఆటోలు, ట్రక్కులను తమ సంస్థ తయారు చేస్తున్నట్టు బివైడీ ప్రతినిధులు వివరించారు. రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ఆర్టీసి ఎండి రమణారావు సీఎంతో పాటు ఎలక్ట్రిక్ వాహనంలో ప్రయాణించారు.