రాష్ట్రీయం

ఒక్క దరఖాస్తు.. 1173 కాలేజీల్లో సీటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 9: ఒకే ఒక దరఖాస్తుతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలో ఏ బ్రాంచిలోనైనా సీటు పొందే అవకాశాన్ని డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ద్వారా కల్పించినట్టు ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ప్రొ. ఆర్ లింబాద్రి తెలిపారు. బుధవారం నాడు ఆయన ఆంధ్రభూమితో మాట్లాడుతూ ‘దోస్త్’ నిర్వహణ తీరుతెన్నులను వివరించారు. డిగ్రీ కాలేజీ ఎక్కడ ఉందో, ఎంత దూరంలో ఉందో తెలుసుకుని అందులో చేరేందుకు వీలుగా జియో ట్యాగింగ్ చేస్తున్నామని అన్నారు. అలాగే దోస్త్ కౌనె్సలింగ్ ప్రక్రియను దేశంలోనే మిగిలిన అన్ని రాష్ట్రాలకూ ఆదర్శంగా రూపొందించామని చెప్పారు. గతంలో ప్రతి కాలేజీలో డబ్బులు చెల్లించి దరఖాస్తు తీసుకుని అప్లయి చేయాల్సిన పరిస్థితి నుంచి రాష్ట్రంలోని 131 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలతో పాటు 1173 డిగ్రీ కాలేజీల్లో ఎక్కడైనా ఒకే ఒక దరఖాస్తుతో సీటు పొందే అవకాశం కల్పిస్తున్నామన్నారు. దోస్త్ ప్రక్రియను ప్రారంభించి రెండేళ్లు కావస్తున్నా, ఈసారి అనేక సాంకేతిక మార్పులను చేశామని పేర్కొన్నారు. ఇంటర్ పాసైన విద్యార్థులు చాలామంది అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, బయోటెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసిన్ ఇతర కోర్సుల్లో చేరుతున్నారని, వారు ఇటు డిగ్రీ కాలేజీల్లో సీట్లు పొందినా వాటిని రద్దు చేసుకోవడం లేదని ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఈసారి దోస్త్ నెట్‌వర్కును ఎంసెట్ అడ్మిషన్ల నెట్‌వర్కుతో అనుసంధానం చేసినట్లు చెప్పారు. ఇంజినీరింగ్ లేదా అగ్రికల్చర్ అనుబంధ కోర్సుల్లో సీట్లు పొందినపుడు అభ్యర్థికి సమాచారం ఇస్తూ డిగ్రీ సీటును రద్దు చేసేలా నెట్‌వర్కులో మార్పులు చేశామని అన్నారు. దీనివల్ల మరో విద్యార్ధికి తాను కోరుకున్న సీటు దక్కే అవకాశం లభిస్తుందని చెప్పారు. కోర్టుకు వెళ్లిన 19 కాలేజీలు, మైనార్టీ కాలేజీలు మినహా మిగిలిన అన్ని కాలేజీలూ దోస్త్ కౌనె్సలింగ్ పరిధిలోకి వచ్చాయని వెల్లడించారు.
అనేక మార్పులు
ఈసారి దోస్త్ ద్వారా కౌనె్సలింగ్‌కు వ్యక్తిగతంగా హాజరై బయోమెట్రిక్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా తీర్చిదిద్దామని లింబాద్రి చెప్పారు. అందులో ప్రధానమైనది ఆధార్ వెరిఫైడ్ మొబైల్ నెంబర్ ఉంటే దాని ద్వారా ఒటీపీ పొంది ఆన్‌లైన్‌లో సమాచారాన్ని ఇస్తే సరిపోతుంది. ఇతర ఆన్‌లైన్ కౌనె్సలింగ్‌లలో అయితే డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని, కానీ దోస్త్‌కు ఆ అవసరం లేకుండా ఈసేవ ద్వారా లింక్ చేసి డాక్యుమెంట్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆటోమెటిక్‌గా దానిని ఆన్‌లైన్‌లోనే వెరిఫై చేస్తామని అన్నారు. టెన్త్, ఇంటర్, కుల ధ్రువీకరణ వంటి పత్రాలు నెంబర్లు ఇస్తే సరిపోతుందని చెప్పారు. సెల్‌ఫోన్ తన పేరుమీదనే లేకున్నా, అందుబాటులో ఉంటే సరిపోతుందని అన్నారు. ఒక వేళ ఆధార్‌తో వెరిఫై కాకుంటే దానిని ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని, ఒక వేళ ఇష్టం లేకుంటే తాము ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ సెంటర్‌కు వచ్చి డాటా ఇవ్వవచ్చని పేర్కొన్నారు.
ప్రతి పట్టణంలో హెల్ప్‌లైన్ సెంటర్
తెలంగాణలో ప్రతి పట్టణంలో హెల్ప్‌లైన్ సెంటర్ ఉండేలా చూశామని లింబాద్రి చెప్పారు. మొత్తం 74 కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. కాకతీయ వర్శిటీ పరిధిలో 16, మహత్మాగాంధీ వర్శిటీ పరిధిలో 9, తెలంగాణ యూనివర్శిటీ పరిధిలో ఏడు, పాలమూరు వర్శిటీ పరిధిలో 13, శాతవాహన పరిధిలో ఆరు, ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో 19 హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు.
భారీగా సీట్లు
ఇంటర్ పాసైన వారి సంఖ్య రెండున్నర లక్షలు దాటకున్నా సీట్లు 4.21 లక్షల వరకూ ఉన్నాయని లింబాద్రి చెప్పారు. కాకతీయ వర్శిటీ పరిధిలో 1.29 లక్షలు, మహాత్మాగాంధీ వర్శిటీ పరిధిలో 35 వేలు, ఉస్మానియా పరిధిలో 1.46 లక్షలు, పాలమూరు వర్శిటీ పరిధిలో 32వేల సీట్లు, శాతవాహన పరిధిలో 47వేలు, తెలంగాణ యూనివర్శిటీ పరిధిలో 25వేల వరకూ సీట్లున్నాయి.
గ్రూప్‌ల వారీగా...
గ్రూప్‌ల వారీగా చూస్తే గత ఏడాది 65,553 సీట్లకు 25,640 మంది, బీబీఎంలో 950కి 306 మంది, బీబీఏలో 5850కి 1764, బీసీఏలో 875కు 336, బీకాంలో 1,58,338 సీట్లకు 80,776 సీట్లు, బీఎస్సీలో 1,87,196 సీట్లకు 91,937, బిఎస్‌డబ్ల్యులో 120కి 36, బీ వొకేషనల్‌లో 100కు 20 సీట్లు భర్తీ అయ్యాయని లింబాద్రి చెప్పారు.
లోపరహిత విధానం
అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో డాటా ఇవ్వగానే వారిచ్చిన డాటా వెరిఫైడ్ అవునా కాదా అన్నదాని ఆధారంగా వారికి మూడు రంగుల్లో ఇండికేషన్ ఇస్తామని అన్నారు. గ్రీన్, ఆరెంజ్, రెడ్ రంగులు ఉంటాయని , సమాచారం అంతా కరెక్టు అయితే వారికి గ్రీన్ కలర్, పాక్షికంగా కరెక్టు అయితే వారికి ఆరెంజ్, అనుమానాలుంటే వారికి రెడ్ కలర్ ఇస్తామని చెప్పారు.
ప్రత్యేక కౌనె్సలింగ్ సెంటర్
అనుమానాలుంటే వాటిని నివృత్తి చేసుకుని సవరించుకునేందుకు ఖైరతాబాద్‌లోని న్యూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో స్పెషల్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు లింబాద్రి తెలిపారు. మూడు దశల్లో అడ్మిషన్లు నిర్వహిస్తామని, ఏదో ఒక దశలో ప్రతి విద్యార్థికీ సీటు దక్కేలా చూస్తామని చెప్పారు.