రాష్ట్రీయం

గురుకుల టీచర్ల రిక్రూట్‌మెంట్‌లో అక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/చార్మినార్, మే 9: ప్రభుత్వం ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిష న్ ద్వారా జరిపిన గురుకుల టీచర్స్ పోస్టుల రిక్రూట్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అ ధ్యక్షుడు ఆర్.కృష్ణ య్య ఆరోపించా రు. ముఖ్యంగా రిజర్వేషన్ల అమలు జరిగిన తీరుపై విచారణ జరిపించాలని ఆయన డిమాం డ్ చేశారు. బు ధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన నిరుద్యోగ అభ్యర్థుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సం దర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ రి క్రూట్‌మెంట్‌లో జరిగిన అక్రమాలు, అవకతవకల కారణంగా వందలాది మంది రిజర్వేషన్ వర్గాలకు ఉద్యోగాలు దక్కలేదని అన్నారు. ఈ సం దర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ రిక్రూట్‌మెంట్‌లలో ఓపెన్ కాంపిటీషన్‌లో రావల్సిన మెరిట్ అభ్యర్థుల ను రిజర్వేషన్లలో భర్తీ చేశారని ఆరోపించారు. సర్వీసు కమీషన్ వారు త ప్పుడు విధానాన్ని అవలంభించారని ఆయన వ్యాఖ్యానించారు. మెరిట్‌లో ఉండి, ఎక్కువ మా ర్కులున్న బీసీ, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులను ఎంపిక చే యవచ్చునని వివరించారు. ఓపెన్ కాంపిటీషన్ లాస్ట్ కటాఫ్ మార్కు తర్వాత రిజర్వేషన్ల పోస్టులను భర్తీ చేయాల్సి ఉందన్నా రు. కానీ వెబ్ ఆ ప్షన్ పేరు మీదు త ప్పుడు విధానా న్ని అవలంబించి, రిజర్వేషన్లు వర్తింపజేయాల్సిన వర్గాలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో ఎస్సీ, బీసీ, ఎస్టీలకు జరిగి న అన్యాయాన్ని సరిదిద్దేందుకు వెం టనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు చ ర్యలు తీసుకోవాలని, లేదంటే ఆం దోళన చేపట్టనున్నట్లు హెచ్చరించా రు. తెలంగాణ విశ్వవిద్యాలయాలకు చెందిన అభ్యర్థులు హాజరైన ఈ స మావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు నీల వెంకటేశ్, గుజ్జకృష్ణ, జైపాల్, రమేశ్, రమ్య, మాల తీ, శైలజ, వేదమని, విద్యాసాగర్, శ్రీ లత, పద్మజ, శ్రీనివాస్, ఉషారాణి, శారద, గీతాంజలి పాల్గొన్నారు.