రాష్ట్రీయం

..లూటింగ్ మాల్స్ !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: ప్రచారాలతో హోరెత్తించి వినియోగదారులను ఆకర్షించే బడా వ్యాపార సంస్థల లోగుట్టు బట్టబయలైంది. హైదరాబాద్‌లో తూనికలు కొతల శాఖ నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో బడా షాపింగ్ మాల్స్‌లో జరుగుతున్న అక్రమాలు బట్టబయలు అయ్యాయి. తూనికలు కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ ఆదేశాల మేరకు గురువారం నాలుగు ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌లో పేరున్న షాపింగ్ మాల్స్‌లో తనిఖీలు చేపట్టాయి. బడామాల్స్‌లో వినియోగదారులను మోసం చేస్తున్నట్టు గుర్తించిన అధికారులు ఆయా మాల్స్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లీగల్ మెట్రాలజీ అధికారులు మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్, పంజాగుట్టలోని హైదరాబాద్ సెంట్రల్, కూకట్‌పల్లిలోని ఫోరం సుజనా మాల్, జీవీకే మాల్‌లో తనిఖీలు నిర్వహించారు. తూకాలలో మోసాలు, ఎంఆర్‌పీ కంటే అధికంగా వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. ప్యాకేజ్డ్ కమోడిటీస్ రూల్స్ ప్రకారం ప్రతి వస్తువుపై తయారీదారుని పేరు, చిరునామా, వస్తువు తయారీ నెల, సంవత్సరం, వస్తువుపేరు, వస్తూవు నికర బరువు, అన్ని పన్నులతో కలిసి ఎంఆర్‌పీ ముద్రించి ఉండాలి. ఇందులో ఏ ఒక్కటి సక్రమంగా లేకపోయినా ఈ చట్టం నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయవచ్చు. వీటి ఆధారంగా తనిఖీలు జరిపిన అధికారులు పంజాగుట్ట సెంట్రల్‌పై 40 కేసులు నమోదు చేసి రూ.15లక్షలు విలువ చేసే వస్తువులను, ఇనార్బిట్‌మాల్‌పై 30 కేసులు నమోదు చేసి రూ. 3.50 లక్షల విలువ, జీవీకేలో 17కేసులు, రూ.3.4 లక్షల, ఫోరమ్ సుజనాలో 15 కేసులు నమోదు చేసి రూ.90వేలు మొత్తం 102 కేసులు నమోదు చేసి ఆయా షాపింగ్ మాల్స్ నుంచి రూ.23లక్షల విలువ చేసే వస్తువులను అధికారులు సీజ్ చేశారు.