రాష్ట్రీయం

రైతులకు అన్యాయమే.. నాలుగేళ్లలో కేసీఆర్ చేసిందేమిటీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: తెలంగాణలోని రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక విధాలుగా మోసం చేస్తున్నారని టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం గాంధీభవన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ నాలుగేళ్ల పాటు రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యారని దుయ్యబట్టారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా రైతు కుటుంబాలను బాగుచేస్తామని ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుబంధు పథకం కేవలం ప్రచారానికే తప్ప రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కనిపించడం లేదని అన్నారు. వాస్తవ రైతులకు సాయం అందించకుండా రైతులను ఏ విధంగా బాగుచేస్తారని ప్రశ్నించారు.
పధకానికి కేటాయించిన డబ్బుకంటే అధికంగా ప్రచారానికి ఖర్చు చేస్తున్నారని అన్నారు. ఇతర రాష్ట్రాల్లోని పత్రికలకు ప్రకటనలు ఎందుకు ఇచ్చి ప్రజల సొమ్మును వృధా చేస్తున్నారన్నారు. ప్రభుత్వం చేసిన రుణమాఫీ రైతులకు లబ్ధిచేకూర్చలేక పోయిందన్నారు. ఏకమొత్తంలో రుణమాఫీ జరగక పోవడంతో రైతుల అప్పులు పూర్తిస్థాయిలో మాఫీ కాకపోగా వడ్డీ అలాగే ఉండిపోయిందని అన్నారు. దీంతో బ్యాంకుల వేధింపుల వల్లే రాష్ట్రంలో అత్యధికంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. రైతు బంధు పథకాన్ని జిమ్మిక్కుగా అభివర్ణించిన ఉత్తమ్ కుమార్ గత నాలుగేళ్లుగా చేసిందేమిటని కేసీఆర్‌ను ప్రశ్నించారు.
కౌలు రైతులకు సాయం చేస్తాం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కౌలు రైతులకు సాయం చేస్తామని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అవలంబించిన విధానాల వల్లే రాష్ట్రంలో నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. రాష్ట్రంలో సుమారు 36లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని వారి పరిస్థితి ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న కంపెనీలను నిలువరించక పోతే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతు సంఘం నాయకుడు కోదండరామిరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు ఇచ్చారో ప్రజలకు తెలుసునని పొన్నాల లక్ష్మయ్య అన్నారు.