రాష్ట్రీయం

నేడు తెలుగు రాష్ట్రాల సీఎస్‌ల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల కీలక భేటీ శుక్రవారం హైదరాబాద్‌లో జరుగనుంది. బేగంపేట మెట్రోరైలు భవన్‌లో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాలకు చెందిన ఆర్థిక, సాధారణ పరిపాలనా శాఖల అధికారులు కూడా హాజరవుతున్నట్టు అధికార వర్గాల సమాచారం. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ఈ నెల 14న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భేటీ కానున్న విషయం తెలిసిందే. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఇచ్చిన నోటిసులో 18 డిమాండ్లు పెట్టారు. ఇందులో ప్రధానమైన డిమాండ్లలో ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులను సొంత రాష్ట్రానికి రప్పించడం ఒకటి. ఈ అంశం ఇరు రాష్ట్రాలకు సంబంధించిది కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో తెలంగాణ ప్రధాన కార్యదర్శి సమావేశాన్ని ఏర్పాటు
చేశారు. ఆంధ్రలో పని చేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులను వెనక్కి రప్పించాలని ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లలో ఇది ఒకటి. ఉద్యోగ సంఘాలతో తాను సమావేశం కాకముందే ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కి రప్పించే అంశంపై ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించాల్సిందిగా సిఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌తో తెలంగాణ సిఎస్ ఎస్‌కె జోషి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఉద్యోగుల డిమాండ్లపైనే కాకుండా రాష్ట్ర విభజన సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య పరిష్కారం కానీ అంశాలపై కూడా ఇరువురు సిఎస్‌లు చర్చించనున్నట్టు సమాచారం. షెడ్యూల్ 9, 10 పరిధిలోని సంస్థల విభజన, ఆస్తుల పంపిణీ, సచివాలయంలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన భవనాల అప్పగింత తదితర అంశాలు కూడా చర్చకు రానున్నాయని అధికార వర్గాల సమాచారం..్చ ఈ వేడుకలను నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు.