రాష్ట్రీయం

జెండానే అజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: సముద్రం ఒకరి కాళ్ల దగ్గరకి వచ్చి గర్జించదని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆవేశంగా మాట్లాడిన పవన్ పవన్ పర్వతం ఎవరికీ ఒంగి సలాం చేయదన్నారు. ‘మనమంతా కలిసి పిడికెడు మట్టే కావచ్చు. కానీ జెండా ఎత్తితే ఉవ్వెత్తున ఎగిసిపడే ధైర్యం, దేశాన్ని ముందుకు తీసుకువెళ్లగలిగే ఆత్మగౌరవం రెపరెపలాడుతుంటాయి’ అని పవన్ అన్నారు. జాతీయ జెండాలో ఉన్న రంగులు మతాలకు ప్రాతినిధ్యం కానేకాదని,కుల మతాల మధ్య చిచ్చుపెట్టే సంస్కృతి పోవాలని అన్నారు. యువతలో విద్యార్ధుల్లో దేశభక్తి నిండా ఉందని చెబుతూ వారితో జాతీయ సమైక్యతా ప్రమాణం చేయించారు. జాతీయ పతాకం సమగ్రత , సమైక్యతలకు సూచికగా నిలుస్తుందని ఉద్ఘాటించిన పవన్ నాయకులు జాతీయ సమైక్యతను మరచినా, యువత , విద్యార్థులు ఆ దిశగా ప్రతిజ్ఞ తీసుకున్నారని అన్నారు. తొలి స్వాతంత్య్ర పోరాటాన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో పవన్ పాల్గొంటున్నారని తెలుసుకున్న యువకులు వేలల్లో తరలి వచ్చారు. జాతీయ పతాకంలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు
అశోక చక్రం ఇవన్నీ మన జాతి సమగ్రతకు, సమైక్యతకు నిదర్శనం అని వ్యాఖ్యానించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పినట్టు జాతీయ జెండా ఏ కులానికో సంబంధించింది కాదని అన్నారు. కాషాయం అంటే హిందూ మతానికి సూచిక కాదని, ఆ రంగు మన రాజకీయ వ్యవస్థ, నాయకులు ఎలా ఉండాలో చెబుతుందని అన్నారు. కాషాయం కట్టిన వాళ్లు సర్వసంగ పరిత్యాగులుగా, స్వలాభం లేకుండా ఉంటారని అన్నారు. మన నాయకులు కూడా అలాగే ఉండాలని చెప్పారు. మన జండా దేశం కోసం త్యాగాలు చేసిన వారిని, స్వలాభం లేకుండా పనిచేసిన వారిని గుర్తుచేస్తుందని అన్నారు. యువత ముందుకు వచ్చి ఈ వేడుకలను నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. భారతీయుడినైన నేను...్భరత దేశ పౌరుడిగా పుట్టినందుకు గర్వపడుతున్నానని అంటూ సమైక్యతా ప్రమాణం చేయించారు. ఈ దేశ వారసత్వ సంపదను పరిరక్షిస్తూ, ప్రకృతికి నష్టం కలిగించకుండా పర్యావరణాన్ని కాపాడుతూ అనునిత్యం దేశ ప్రజలకై పరితపిస్తూ, మన అక్క చెల్లెళ్లనీ, ఆడపడుచుల పట్ల పేగుబంధంతో కాపాడుతామని, చట్టాలను గౌరవిస్తూ, కుల మత ప్రాంత వర్గ విబేధాలకు తావులేకుండా దేశ ప్రయోజనాలే పరమావధిగా భావిస్తానని జండా సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని పవన్ పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో వైబ్రంట్స్ ఆఫ్ కలామ్ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ కలామ్ కూడా పాల్గొన్నారు.