రాష్ట్రీయం

స్మార్ట్‌సిటీగా ఓర్వకల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, మే 10: కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు పారిశ్రామిక నగరంగా ప్రత్యేకత సంతరించుకుని స్మార్ట్‌సిటీగా రూపాంతరం చెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గురువారం ఓర్వకల్లు మండలం గుట్టపాడు గ్రామంలో జయరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఓర్వకల్లులోని జిల్లా పరిషత్ హైస్కూల్ మైదానంలో ఏర్పాటుచేసిన సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి ఒకప్పుడు ఓర్వకల్లులో రాళ్లురప్పలు తప్ప అభివృద్ధి లేదన్నారు. ప్రస్తుతం పారిశ్రామిక హబ్‌గా పేరొంది ప్రపంచం దృష్టిని ఆకర్షించిందన్నారు. ఇక్కడ ఉన్న సహజ వనరుల గురించి అవగాహన కల్పించడంతో బడా పారిశ్రామికవేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారన్నారు. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్, జయరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ, పుట్టగొడుల పరిశ్రమలతో పాటు డీఆర్‌డీఏ ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఉర్దూ, క్లస్టర్ యూనివర్శిటీలు రూ.3 కోట్లతో మైనార్టీ ఐటీఐ వంటి విద్యాకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జయరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమను రూ.3వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నారన్నారు. దీంతో 1200 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రూ.85వేల కోట్లతో పరిశ్రమలు ఏర్పాటు చేసి 80 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఒకప్పుడు శ్రీసిటీ కూడ చిన్నగా ఉండేదని, ఓర్వకల్లు కూడా శ్రీసిటీని మించి అభివృద్ది చెందుతుందన్నారు. కర్నూలు-కడప జాతీయరహదారితో పాటు బెంగళూరు-హైదారాబాద్ జాతీయరహదారులు ఉన్నాయని, వాటికి అనుసంధానంగా ఎయిర్‌పోర్టును సెప్టెంబర్‌లో ప్రారంభిస్తామన్నారు.