రాష్ట్రీయం

మీ వెంటే మేమున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియాచిన్, మే 10: రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ప్రపంచంలోనే అత్యంత ఎతె్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సైనికులను కృతజ్ఞతలు తెలిపారు. గత 34 సంవత్సరాలుగా ధైర్యసాహసాలకు పేరుపడిన మన సైనికులు ఇక్కడ విధులు నిర్వర్తించడం వల్ల, దేశ ప్రజలకు మన సరిహద్దులు భద్రంగా ఉన్నాయన్న విశ్వాసం ఏర్పడుతోందన్నారు. భారత ప్రజలు, భారత ప్రభుత్వం పూర్తిగా మీవెన్నంటే ఉన్నారని మళ్లీ చెబుతున్నానన్నారు. అంతేకాదు వీరి కుటుంబాలకు అన్ని వేళలా అవసరమైన మద్దతు ఉంటుందన్నారు. ‘మీరు చేస్తున్న కృషికి భారత ప్రజల కృతజ్ఞతలు చెప్పడానికి మీవద్దకు వచ్చా’ అన్నారు. కాగా రాష్టప్రతి కుమార్ పోస్ట్‌ను కూడా సందర్శించారు. 2004లో అప్పటి రాష్టప్రతి అబ్దుల్ కలాం తర్వాత ఈ ప్రాంతాలను రాష్టప్రతి సందర్శించడం ఇదే ప్రథమం. అంటే గత 14 సంవత్సరాల్లో సియాచిన్‌ను సందర్శించిన తొలి రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ మాత్రమే. ఇక్కడ విధులు నిర్వర్తించే సైనికులు ఢిల్లీ సందర్శించినట్లయితే తప్పనిసరిగా రాష్టప్రతి భవన్ రావాలని కోరారు. ఈ సందర్భంగా సియాచిన్ వార్ మెమోరియల్ వద్ద రాష్టప్రతి నివాళులర్పించారు. 1984, ఏప్రిల్ 13న భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ మేఘ్‌దూత్‌లో మరణించిన 11వేల మంది సైనికులు, అధికార్ల స్మృతి చిహ్నంగా దీన్ని నెలకొల్పారు. సియాచిన్‌లోని కొన్ని పోస్టులు 20 వేల అడుగులకంటే ఎక్కువ ఎత్తున ఉంటాయి. ఇక్కడ మైనస్ 52 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి. ప్రపంచంలోనే అతి సంక్లిష్టమైన యుద్ధ క్షేత్రంగా దీనికి పేరు.