రాష్ట్రీయం

ఇచ్చి పుచ్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 11: రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య పెండింగ్‌లో ఉన్న అంశాల సామర్య పూర్వక పరిష్కారానికి ఇరు రాష్ట్రాలు సమ్మతించాయి. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సమస్యలను పరిష్కరించుకోవడానికి అంగీకారానికి వచ్చాయి. అయితే తమ పరిధిలో లేని అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన ఉండటంతో తాము ఎలాంటి హామీ ఇవ్వలేమని ఆంధ్రప్రదేశ్ అధికారులు తేల్చి చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల ఉమ్మడి సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో మెట్రోరైలు భవన్‌లో జరిగింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్, ముఖ్య కార్యదర్శి
ప్రేమ్‌చందర్‌రెడ్డి తదితర ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు. సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించిన కార్యాలయ భవనాలను తమకు అప్పగించాలని తెలంగాణ అధికారులు కోరగా, ఈ అంశం తమ పరిధిలోకి రాదని స్పష్టం చేసారు. ప్రభుత్వ అధినేతలు తీసుకోవాల్సిన విధానపరమైన అంశమని దీనిపై తాము హామీ ఇవ్వలేమని తేల్చి చెప్పారు. ఇది ఒకటి తప్ప మిగతా అంశాలను సామరస్యంగా పరిష్కరించుకుందామని నిర్ణయించారు. ఉద్యోగుల విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన తెలంగాణ ప్రాంత ఉద్యోగులను తిరిగి పంపించడానికి అభ్యంతరం లేదని సానుకూలంగా స్పందించారు. షెడ్యూల్ 9, 10 సంస్థలు, ఆర్టీసి విభజనతో పాటు ఇతర ఆస్తుల పంపిణీ తదితర సమస్యలపై తెలంగాణ నుంచి ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ నుంచి సాధారణ పరిపాలనశాఖ సభ్య కార్యదర్శిగా కొనసాగుతోన్న ప్రేమ్‌చందర్‌రెడ్డితో కమిటీని ఏర్పాటు చేసింది. వీరు ఇరువురు ఇరు రాష్ట్రాల అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి నిర్ణయాలు తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది. డిఎస్సీల విభజనలో సమస్య తలెత్తడంతో హైకోర్టు అనుమతితో తాత్కాలిక సర్దుబాటు చేసుకోవాలని సమావేశం నిర్ణయించింది. అలాగే ఢిల్లీలో ఎపి భవన్ విభజనకు ఇరువురి కమిటీ చొరవ తీసుకోవాలని నిర్ణయించింది. ఉద్యోగుల బదిలీలపై ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదరడంతో ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు కూడా అనుమతించాలని నిర్ణయించింది.