రాష్ట్రీయం

అహంతో అనర్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 11: అహం పెరగడం వల్లే బీజేపీ నేతలు ప్రజలకు దూరమయ్యారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తమనే ప్రశ్నిస్తారా అనే ఆధిపత్య భావన ప్రజలకు దూరం చేస్తుందన్నారు. లాలూచీ పార్టీలతో పోరాటం ఆషామాషీ కాదని, 175 నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు. ఉండవల్లి గ్రీవెన్స్ హాలులో టీడీపీ విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎన్నికలకు ముందు నరేంద్రమోదీ అందరి అభిమానం పొందారని, అన్ని వర్గాల వారు మోదీ పట్ల ఆకర్షితులయ్యారని గుర్తుచేశారు. కానీ నాలుగేళ్ల తర్వాత అదే మోదీని ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అన్న అంశాన్ని ప్రతిఒక్కరూ విశే్లషించుకోవాలని సూచించారు. ఇది మోదీకే కాక ప్రతి ఒక్కరికీ వర్తిసుందన్నారు. బేషజాలకు పోతే ప్రజలు దూరమవుతారని ఎంతటి నాయకుడికైనా ఈ పరిస్థితి తప్పదని హెచ్చరించారు. లాలూచీ పార్టీలతో పోరాటం ఆషామాషీ వ్యవహారం కాదని వైకాపానుద్దేశించి వ్యాఖ్యానించారు. బెంగళూరులో ఎన్‌జీవోలను అడ్డుకున్నది వైకాపా వాళ్లేనని స్పష్టం చేశారు. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీ నేతలకు అనుకూలంగా వైకాపా నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీని జగన్ విమర్శించరని, అలాగే వైకాపాను కూడా బీజేపీ విమర్శించదని ఎద్దేవా చేశారు. వీళ్లందరూ టీడీపీనే తిడుతుంటారని ఈ పార్టీల లాలూచీ రాజకీయాలను, కపట నాటకాలను ప్రజల్లో ఎండట్టాలని పార్టీ వర్గాలకు పిలుపునిచ్చారు. గతంలో తాము పాదయాత్ర చేస్తే దారంతా సమస్యల మయమని, కానీ జగన్ పాదయాత్ర చేస్తుంటే సమస్యలు చెప్పేవారే లేరంటూ ఎద్దేవా చేశారు. ఆ రెండు పాదయాత్రల్లో తేడా ఇదేనని గుర్తించాలన్నారు. అప్పట్లో రైతులు, మహిళలు, విద్యార్థులు అందరిలో తీవ్ర అసంతృప్తి, అశాంతి ఉంటే ఇప్పుడు అన్ని వర్గాల ప్రజల్లో ప్రభుత్వం పట్ల 73శాతం సంతృప్తి ఉండటమే తమ సుపరిపాలనకు నిదర్శనమన్నారు. ప్రాణాలు కూడా లెక్కచేయని
కార్యకర్తలు టీడీపీ సొంతమని, నాలుగైదు రోజులు అలిగినా ఎన్నికల నాటికి ఏకతాటిపై నడవటం తమ పార్టీ కార్యకర్తల సుగుణమంటూ కితాబిచ్చారు. టైం బౌండ్ కార్యక్రమం పెట్టుకుని కార్యకర్తలతో సత్సంబంధాలు పెంచుకోవాలని సూచించారు. పోలింగ్ బూత్ దగ్గర నిలబడేది అధికారి కాదని, కార్యకర్తేనని గుర్తుంచుకోవాలన్నారు. నూటికి 90 శాతం మంది కార్యకర్తలు కోరుకునేది గౌరవం మాత్రమేననిచెప్పారు. కార్యకర్తలను, ప్రజలను సంతృప్తిపరచటంలోనే నాయకత్వ సామర్థ్యం బయటపడుతుందని తెలిపారు. ప్రవర్తన, కలుపుగోలుతనమే మీ గెలుపును నిర్ధారిస్తాయంటూ దిశా నిర్దేశం చేశారు. 73శాతం మేరకు ప్రభుత్వం పట్ల ప్రజల్లో సంతృప్తి ఉందని దీన్ని ఓట్లుగా మార్చుకోవడంలో మీ సామర్థ్యం వెల్లడవుతుందన్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉందని ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ పిలుపునిచ్చారు. కేంద్రంపై ధర్మ పోరాటం చేస్తున్నామని, నాలుగేళ్ల కష్టంతో రాష్ట్రాన్ని తామే అభివృద్ధి చేసుకున్నామన్న భావన ప్రజల్లో ఉందన్నారు. కర్నాటక ఎన్నికల తరువాత ఏపీ సంగతి చూస్తామని బీజేపీ నేతలు బెదిరిస్తున్నారని, వ్యాఖ్యానిస్తున్నారని, కానీ టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరని రెండురోజులపాటు కలెక్టర్లతో వివిధ అంశాలను చర్చించామని, పటిష్టమైన బృందాన్ని నిర్మించుకోవాలని తెలిపారు. అధికారులది ఉద్యోగమని, మనది వాలంటరీ అని వ్యాఖ్యానించారు. అధికారులను నడిపించాల్సిన బాధ్యత మనదేనని తెలిపారు. ఇప్పుడున్న బృంద సభ్యులను ఎవరినీ వదులుకోటానికి తాను సిద్ధంగా లేనని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని పార్టీ నేతలను కోరారు. సరైన స్థానంలో సరైన అభ్యర్థులను నిలబెట్టాల్సిన బాధ్యత తనపై ఉందని, 175 నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత కూడా తనపై ఉందన్నారు.
ఉపఎన్నికలు వస్తే తఢాఖా చూపిద్దాం
వైకాపా ఎంపీల రాజీనామాలను జూన్ 2 తరువాత ఆమోదించే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు సీఎం చేశారు. ఉప ఎన్నికలు వస్తే తమ తడాఖా చూపుతామని తెలిపారు. తెలంగాణలో ఒకసారి ఉప ఎన్నికలు వస్తే, 25 సీట్లలో 7 సీట్లు గెలుచుకున్నామని గుర్తు చేశారు.