రాష్ట్రీయం

మళ్లీ చర్చించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 11: ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో 14న జరగాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం 16కు వాయిదా పడింది. ఉద్యోగుల, ఉపాధ్యాయుల డిమాండ్లపై మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికపై వారితో 14న చర్చించి ప్రభుత్వ
నిర్ణయాలను ప్రకటించనున్నట్టు కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆర్టీసి కార్మికులు కూడా ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వడంతో వారితో కూడా చర్చించేందుకు వీలుగా సమావేశాన్ని రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి వాయిదా వేసారు. అలాగే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో మంత్రివర్గ ఉప సంఘంలో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డిని కూడా చేర్చించినట్టు కేసీఆర్ తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లపై ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం శుక్రవారం సాయంత్రం తన నివేదికను ప్రగతి భవన్‌వో సిఎంకు సమర్పించింది. ఈ నివేదికపై అప్పటికప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావుతో ముఖ్యమంత్రి చర్చించారు. ఉద్యోగులతో మళ్లీ చర్చలు జరిపి, వారి డిమాండ్లపై అధ్యయనం చేయాలని మంత్రివర్గ ఉప సంఘాన్ని తిరిగి ఆదేశించారు. ఆ తర్వాత ఈ నెల 16న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసి కార్మికులతో సమావేశమై అదే రోజు ప్రభుత్వ నిర్ణయాలను ప్రకటించనున్నట్టు సిఎం తెలిపారు. వేతన సవరణ సంఘం నివేదిక ఇవ్వడానికి గతంలో మాదిరిగా ఎక్కువ సమయాన్ని తీసుకునే విధానానికి స్వస్తి పలికి త్వరగా నివేదిక ఇచ్చే విధంగా వ్యూహాన్ని ఖరారు చేయాల్సిందిగా అధికారులను సిఎం కేసీఆర్ ఆదేశించారు.