రాష్ట్రీయం

నేటి నుంచి బోట్లు తాత్కాలికంగా రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవీపట్నం, మే 12: పాపికొండలు విహారయాత్రకు వెళ్లే బోట్లు, లాంచీలను ఆదివారం నుంచి తాత్కాలికంగా రద్దుచేస్తున్నట్టు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ బోట్స్ సూపరింటెండెంట్ బి రత్నరాజు తెలిపారు. శుక్రవారంనాటి సంఘటన పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గోదావరి నదిలో 68 లాంచీలు, బోట్లకు లైసెన్సులు రెన్యువల్ చేయాల్సి ఉందని, ఆ గడువు ఏప్రిల్ 30తో ముగిసినప్పటికీ మే వరకు తాత్కాలిక పర్మిట్లు ఇచ్చామన్నారు. శుక్రవారం వీరవరంలంక రాయల్ గోదావరి బోటులో జరిగిన దుర్ఘటనను పురస్కరించుకుని లాంచీలను, బోట్లను రద్దుచేశామన్నారు. లైసెన్సు రెన్యువల్ కోసం కనీసం నాలుగైదు రోజులు సమయం పడుతుందని, అప్పటివరకు గోదావరి నదిలో విహార యాత్రకు వెళ్లే బోట్లకు ఏవిధమైన అనుమతి లేదని ఆయన అన్నారు.