రాష్ట్రీయం

స్థిరంగా.. అల్పపీడన ద్రోణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 12: విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకూ విస్తరించిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. ఇది పశ్చిమ దిశగా కదులుతూ ఈనెల 15నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్నారు. అయితే దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండకపోవచ్చు. ద్రోణి ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండుచోట్ల మోస్తరు వర్షాలు కురవచ్చు.