రాష్ట్రీయం

ఇవిఎంలకు ప్రింటర్లను అమర్చాలన్న పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు ప్రింటర్లను అనుసంధానం చేసి ఓటు వేసిన ప్రతి వోటరుకు రశీదు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో నోటా ఆఫ్షన్‌ను కూడా చేర్చాలని కోరారు. ఈ పిటిషన్‌ను టిపిసిసి అధికార ప్రతినిధి డి శ్రవణ్‌కుమార్, కమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, వరంగల్ జిల్లా డిసిసి అధ్యక్షులు ఎన్ రాజేంద్రరెడ్డి దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ సంజయ్ కుమార్ బెంచ్ విచారణ నిమిత్తం స్వీకరించింది. ఇప్పటికే సుప్రీం కోర్టు వయబుల్ వోటర్ వేరియబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వివిపిఏటి)ని అమర్చాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. కాని ఇంతవరకు ఇవిఎంలకు వివిపిఏటిలను అమర్చలేదన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఇవిఎంలలో నోటా ఆప్షన్‌ను అమర్చలేదని వారు కోర్టుకు తెలిపారు. ఇప్పటికే ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్లకు ఎన్నికల నోటిఫికేషన్లను జారీ చేయడం వల్ల ఇవిఎంలకు ప్రింటర్లను అమర్చడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. కేసు విచారణను మార్చి 15కు వాయిదా వేశారు.