ఆంధ్రప్రదేశ్‌

ఆ పత్తి విత్తనాలను ఓ కంట కనిపెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 14: రాష్ట్రంలోకి గుజరాత్ నుంచి అనుమతి లేని పత్తి విత్తనాలు వస్తున్నాయని, వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి నీరు-ప్రగతి, వ్యవసాయంపై సోమవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నాసిరకం పత్తి విత్తనాలు మార్కెట్‌లోకి రాకుండా కట్టడి చేయాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతులను మోసగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. నకిలీ విత్తనాలపై రైతుల్లో అవగాహన పెంచాలని సూచించారు. ఈ సీజన్‌లో నెల్లూరు జిల్లాలో పంటల ఉత్పాదకత గణనీయంగా పెరిగిందని, మిగిలిన జిల్లాలు కూడా నెల్లూరు జిల్లాను నమూనా తీసుకుని అధ్యయనం చేయాలన్నారు. వర్మీకంపోస్టు 207 టన్నులు సిద్ధంగా ఉందని, రసాయన ఎరువుల వాడకం పూర్తిగా తగ్గించి సేంద్రీయ ఎరువుల వినియోగం పెంచాలన్నారు.
పంటల ఉత్పత్తుల నాణ్యత పెరగాలని, నాణ్యమైన వ్యవసాయ దిగుబడులకు ఏపీ చిరునామాగా మారాలన్నారు. ఖరీఫ్ సీజన్‌కు రైతలకు కావలసిన ఇన్‌పుట్స్ సిద్ధం చేయాలన్నారు. వ్యవసాయ పనులు లేకపోవటంతో ఉపాధి పనులను ముమ్మరం చేయాలని సూచించారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమయ్యేలోగా గరిష్టంగా ఉపాధి పనులు జరగాలన్నారు. ఈ నెలలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల మేర ఉపాధి హామీ పనులు జరుగాలని, రోజువారీ కూలీల హాజరు 23లక్షలకు చేరాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో తాగునీటి కొరత లేకుండా చేయాలని, గిరిజన తండాల్లో 105 కోట్లతో చేపట్టిన పనులను వేగవంతం చేయాలన్నారు. మరో 8వేల మరుగుదొడ్లు నిర్మిస్తే నూరుశాతం ఓడీఎఫ్ అవుతుందన్నారు. ఓడీఎఫ్ ప్లస్ పనులకు అన్ని జిల్లాలు సంసిద్ధం కావాలని, ఇందుకు కేటాయించిన 900 కోట్ల రూపాయలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. డిసెంబర్ నాటికి అన్నీ స్వచ్ఛ గ్రామాలు కావాలన్నారు. కేంద్రంతో విభేదించిన తమిళనాడు, కేరళ రాష్ట్రాలు దేశంలో ముందంజలో ఉన్నాయని, అదేవిధంగా ఏపీ కూడా విభేదించినప్పటికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ముందుండాలన్నారు.
మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్‌లో మన దేశం ఏ స్థాయిలో ఉందో పరిశీలించాలని, దేశంలో పదేళ్లలో పేదరికం 51శాతం నుంచి 21శాతానికి తగ్గిందన్నారు. కేరళలో పేదరికం ఒక శాతం, తమిళనాడులో 6శాతం, కర్ణాటకలో 11శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 13శాతం, తెలంగాణలో 14శాతం, గుజరాత్‌లో 16శాతం ఉందన్నారు. ఏపీ కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ మరిన్ని పథకాలు అమలుచేయటం వల్ల ర్యాంక్ పెరిగే అవకాశం ఉంటుందన్నారు.

పోలవరంలో చెల్లింపుల ఇరకాటం
బిల్లుల చెల్లింపు ప్రక్రియ అంతా రాష్ట్ర ప్రభుత్వం సీఎఫ్‌ఎంఎస్ (కాంప్రహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) విధానంలో విలీనం చేసింది. దీన్ని పీఏవో (పే అండ్ అకౌంట్స్), ట్రెజరీకి అనుసంధానం చేశారు. ఈ విధానంలో అంతా ఆన్‌లైన్‌లోనే బిల్లులు తీసుకోవాల్సివుంది. ఈ విధానంలో ప్రతీ బిల్లునూ నిర్దేశిత ఫార్మాట్‌లో స్కాన్‌చేసి అప్‌లోడ్ చేయాల్సివుంది. ఈ బిల్లు 48 గంటల్లోగా సిద్ధమై విడుదలవుతుంది. బిల్లులన్నీ ముందుగా సీఎఫ్‌ఎంఎస్ విధానంలో సాప్ట్‌వేర్‌ను తెరిచి సంబంధిత అకౌంట్ నెంబర్‌లో లాగిన్ అవ్వాల్సివుంది. ఆ బిల్లును సంబంధిత ఉద్యోగి తయారు చేయాల్సివుంది. వీరిని బిల్ మేకర్ అని అంటారు. మేకర్ తయారుచేసిన బిల్లు ఆపై తనిఖీకి చెకర్‌కు వెళ్తుంది. బిల్లును తనిఖీచేసే ఉద్యోగిని చెకర్ అంటారు. అక్కడ చెక్‌చేసిన తర్వాత సబ్మిమిటర్ వద్దకు వెళ్తుంది. సంబంధిత సబ్మిటర్ వేలిముద్ర వేసిన తర్వాత ట్రెజరీకి, పీఏవోకు వెళ్తుంది. అక్కడ నుంచి బిల్లు సిద్ధమై మంజూరయ్యేందుకు, సంబంధిత లెక్కలు ఆన్‌లైన్‌లో తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది. ఇందుకు సంబంధించి సంబంధిత సిబ్బందికి ఎక్కడా పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వలేదు. తూతూ మంత్రంగా శిక్షణ కల్పించడం వల్ల అవగాహన లేక అంతా గందరగోళంగా మారింది. బిల్లులు తయారు చేయడంలోగాని, విడుదలలోగాని స్పష్టత లేకుండా పోయింది. ఇలా అరకొరగానే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సీఎఫ్‌ఎంఎస్ విధానం ఆర్భాటంగా అమల్లోకి తెచ్చేశారు. ఈ వ్యవస్థ నిర్వహణకు సంబంధించిన కేంద్ర కార్యాలయాన్ని సచివాలయం దిగువన ఏర్పాటుచేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, సిబ్బంది జీతాల బిల్లులతో పాటు పోలవరం ప్రాజెక్టు మొత్తం కార్యకలాపాలన్నీ ఈ విధానంలో అనుసంధానంచేశారు. సీఎఫ్‌ఎంఎస్ విధానం సాంకేతిక సమస్యలను నివృత్తి చేయడానికి జిల్లాల్లో కూడా సంబంధిత సాఫ్ట్‌వేర్ సంస్థ సిబ్బంది ఉండాలి. కానీ ఇంకా ఎక్కడా జిల్లాస్థాయిలో సీఎఫ్‌ఎంఎస్ వ్యవస్థ ఏర్పడలేదు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సిబ్బంది జీతాలు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీతాలు, భూసేకరణ బిల్లులు, కాంట్రాక్టర్ల చెల్లింపులు, జీత భత్యాలు, ఆర్ అండ్ ఆర్ బిల్లులు ఇలా అన్ని రకాల బిల్లులు వివిధ రకాల హెడ్ ఆఫ్ అకౌంట్స్ నుంచి పొందాల్సివుంది. ఆయా కార్యాలయాల్లో తయారైన బిల్లులన్నీ ఈ నూతన సాంకేతిక విధానంలో పిఎఓ విభాగం నుంచి పొందాల్సి వుంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సంబంధిత కార్యాలయాల సిబ్బంది జీతాలన్నీ పాత విధానంలో పీఏవో కార్యాలయం నుంచి పొందేవారు. తాజా విధానంలో ట్రెజరీలకు బదలాయించారు. జీతాల బిల్లులు తప్ప మిగిలిన ఇతరత్రా బిల్లులన్నీ పీఏవో కార్యాలయం నుంచి సీఎఫ్‌ఎంఎస్ విధానంలో పొందాల్సి వుంది. దీనితో ప్రస్తుతం రెండు నెలలుగా సిబ్బందికి, అధికారులకు జీతాల్లేకుండా పోయింది. తక్కువ జీతాలుంటే అవుట్ సోర్సింగ్ సిబ్బందికి సైతం జీతాల్లేక గగ్గోలు పెడుతున్నారు. రూ. కోట్ల విలువైన ఆర్ అండ్ ఆర్, భూసేకరణ బిల్లులు స్తంభించాయి. రెండు నెలలుగా కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన సుమారు రూ.150 కోట్ల బిల్లులు నిలిచిపోయాయి. సుమారు రూ.56 కోట్ల ఆర్ అండ్ ఆర్, భూసేకరణ బిల్లుల చెల్లింపులు జరగలేదని తెలుస్తోంది. ఆర్ అండ్ ఆర్, భూసేకరణ బిల్లుల అకౌంట్ల హెడ్‌లు సీఎఫ్‌ఎంఎస్‌లో అసలు కన్పించడమే లేదంటే వ్యవస్థ ఎంత గందరగోళంగా వుందో అర్ధం చేసుకోవచ్చు. దీనితో లక్ష్యం మేరకు జరగాల్సిన పనులన్నీ ఆలస్యమవుతున్నాయి.