రాష్ట్రీయం

ఆంధ్రకు మొండిచెయ్యి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మే 15: స్వాతంత్య్ర సమరంలో బ్రిటిష్‌వారి పంచన చేరి భారతదేశానికే ద్రోహం చేసిన ద్రోహుల జాబితాల్లో ఇప్పుడు జగన్ చేరారంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ కోసం పోరాటం చేయాల్సిన వ్యక్తులు కేసులు మాఫీ కోసం బీజేపీతో చేతులుకలిపి ఐదు కోట్లు ఆంధ్రులకు అన్యాయం చేస్తున్నారన్నారు. బీజేపీ-వైసీపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయని, ఆంధ్రులకు అన్యాయం చేశారని బాబు ఆగ్రహాంతో విమర్శలదాడి చేశారు. శ్రీకాకుళం జిల్లా, సారవకోట మండలం రంగసాగరం వద్ద మంగళవారం నీరు-ప్రగతి కార్యక్రమంలో భాగంగా జల సంరక్షణ ఉద్యమం పేరిట రూ.180.22 కోట్లుతో బొంతు ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. నెత్తిన అప్పుపెట్టుకుని కట్టుబట్టలతో విభజన సమయంలో వేర్పాటయ్యామని, ప్రత్యేక హోదా చట్టం అమలు, అమరావతి అభివృద్ధి వంటి అంశాల కోసమే బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని బాబు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా
ఇమ్మని అడిగామని, 29 సార్లు ఢిల్లీ వెళ్ళి కేంద్రానికి ప్రాధేయపడితే నాలుగేళ్ళు బడ్జెట్‌ల్లో అన్యాయం చేశారని ఆరోపించారు. 11 రాష్ట్రాలకు ప్రత్యేకంగా హోదా ఇచ్చిన కేంద్రం ఏపీకి ఇవ్వకుండా మోసం చేసిందని ఆరోపించారు. దక్షిణ భారతదేశం రాష్ట్రాలతో పోల్చుకుని అభివృద్ధి జరగాలంటే ఎనిమిది, తొమ్మిదేళ్ళు పడుతుందన్నారు. తనను విమర్శిస్తే ప్రత్యేక హోదా వస్తుందా? అంటూ వైసీపీ నేతలతోపాటు, మిగిలిన పార్టీలను నిలదీశారు.
జగన్మోహన్‌రెడ్డి ఒక్కడే ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్నాడంటూ సర్ట్ఫికేట్ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని చంద్రబాబు అన్నారు. వైసీపీలో చేరేందుకు అన్నీ సిద్ధం చేసుకున్న కన్నా లక్ష్మీనారాయణ అర్ధాంతరంగా ఆసుపత్రిలో చేరి తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం వెనుక జగన్ వ్యూహాత్మకమైన రాజకీయ ఎత్తుగడ ఉందన్న సంగతిని ఆంధ్రులంతా అర్థం చేసుకోవాలని కోరారు. శుక్రవారం కోర్టుకు వెళ్ళి బోనులో చేతులుకట్టుకునే జగన్ తనను విమర్శిస్తున్నా భరిస్తున్నానన్నారు. రాజకీయాలు అర్థం చేసుకుని ఐదుకోట్ల ప్రజలు తప్పుడు ప్రచారం చేసినవారిపై తిరగబడాలని పిలుపునిచ్చారు. కేంద్రప్రభుత్వం సహకారం లేకపోయినా మీ కోసం అహర్నిశలు పనిచేస్తున్నానని, అనుభవం లేని వ్యక్తులు ఆశలు చూపించి హామీలిస్తారని, అటువంటి వారిని ఏపీ నుంచే తరిమేయండి అంటూ విజ్ఞప్తి చేసారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన చేస్తున్నాని, మనస్సాక్షిగా ప్రజలు సహాకారం అందించాలని, నిండు మనస్సుతో ఆశీస్సులు ఉండాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో 25 ఎం.పి.సీట్లును గెలిపించాల్సిన బాధ్యత ఏపీ ప్రజలపైనే ఉందన్నారు. అప్పుడే దేశంలో టీడీపీ కీలకమైన నిర్ణయాలకు కేంద్రబిందువుగా మారుతుందన్నారు.
విభజన చట్టంలో అమలుచేయాల్సిన ఒక్క అంశాన్ని కేంద్రం అమలుచేయలేదని, జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నాడంటూ బీజేపీ కితాబు ఇవ్వడం, తిరుపతి వెంకేశ్వరుడు సాక్షిగా చెప్పినమాట తప్పడంతోనే బీజేపీతో విభేదించామని బాబు వివరణ ఇచ్చారు. రాష్టమ్రంతటా ధర్మపోరాటానికి ప్రజలు సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 50 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని, ఎస్టీలకు 75 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే సాగునీటి కోసం రూ. 3000 కోట్లు వెచ్చించామని, మరో రూ. 4,100 కోట్లుతో సస్యశామలం చేస్తానని హామీ ఇచ్చారు. రేపటి నుంచి చంద్రన్న పెళ్ళికానుక ఇస్తున్నట్టు ప్రకటించారు. భారతదేశంలో పెళ్ళికానుక ఇచ్చే ఏకైక ప్రభుత్వం టీడీపీయే అన్నారు.
ప్రజలతో ఉండేవారికే బీఫారాలు
ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తులకే 2019 సార్వత్రిక ఎన్నికల్లో బి.్ఫరాలు ఇస్తానంటూ చంద్రబాబు వెల్లడించారు. ఐవీఆర్‌ఎస్ ద్వారా ఎమ్మెల్యేల పనితీరును తెలుసుకుంటున్నాని చెప్పారు. ప్రజలకు సమస్య ఉంటే 1100 టోల్‌ఫ్రీ కాల్ చేయండంటూ ఏపీ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ముందుగా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి జిల్లా ప్రగతిని వివరించగా, నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా, పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు మాట్లాడారు. ముందుగా నీరు-ప్రగతి పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి, బొంతు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎం.పి. రామ్మోహన్‌నాయుడు దత్తత తీసుకున్న బురుజువాడ గ్రామాన్ని సందర్శించారు.

చిత్రం..శ్రీకాకుళం జిల్లా చిన్నకిట్టాలపాడు గ్రామసభలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు