రాష్ట్రీయం

ఆర్టీసీ సిబ్బందివి గొంతెమ్మ కోర్కెలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల వేతనాలు పెంపు డిమాండ్ గొంతెమ్మ కోరికేనని సీఎం కేసీఆర్ అభిప్రాయపడినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయుల డిమాండ్లపై బుధవారం సమావేశమవుతున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి ఉన్నతాధికారులు, కేబినెట్ సబ్ కమిటీతో సీఎం సమావేశమయ్యారు. సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసు ప్రస్తావనకు రాగా, సీఎం కేసీఆర్ ఒకింత విచారం వ్యక్తం చేసినట్టు తెలిసింది. గతంలో ఎన్నడూలేని విధంగా ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ
ఆవిర్భావం అనంతరం 44శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు. ఇప్పటికే టీఎస్‌ఆర్టీసీ సుమారు 2800 కోట్ల నష్టాల్లో ఉండగా, ఉద్యోగులు వేతనాల పెంపునకు డిమాండ్ చేయడం అసంబద్దమని అన్నట్టు తెలిసింది. ఇతర రాష్ట్రాల ఆర్టీసీ ఉద్యోగులతో పోలిస్తే తెలంగాణలో మంచి వేతనాలే ఇస్తున్నా, ఉద్యోగులు సమ్మె నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని సబ్ కమిటీతో భేటీలో వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఉద్యోగుల డిమాండ్ మేరకు వేతనాలు పెంచితే సంస్థపై మరో 1400 కోట్ల భారం పడే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న సంస్థను ప్రభుత్వం నడపాలా? వద్దా? అని ఉద్యోగులు తమకుతాము ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుటుందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడినట్టు సమాచారం.