రాష్ట్రీయం

జైలుకి అగ్రిగోల్డ్ ఛైర్మన్, ఎండి మరో ముగ్గురు సిఐడి కస్టడీకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: డిపాజిటర్లను మోసం చేశారన్న అభియోగాలను ఎదుర్కొంటూ, కోర్టు ఆదేశాల మేరకు వారం రోజులుగా సిఐడి కస్టడీలో ఉన్న అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వా వెంకట రామారావు, ఎండి అవ్వా వెంకట శేషు నారాయణరావు మంగళవారం తిరిగి జ్యుడీషియల్ రిమాండులోకి వెళ్లారు. సిఐడి అధికారులు మంగళవారం వారిని కోర్టుకు హాజరుపర్చారు. అనంతరం రిమాండ్‌లో భాగంగా ఏలూరులోని జిల్లా జైలుకు తరలించారు. కాగా ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండులో భాగంగా జైలులోవున్న సంస్థ వైస్-్ఛర్మన్ ఇమ్మది సదాశివ వరప్రసాద్, ఎండి కామిరెడ్డి శ్రీరామచంద్రరావు, డైరెక్టర్ పఠాన్‌లాల్ అహ్మద్ ఖాన్‌ను మంగళవారం సిఐడి కస్టడీకి తీసుకున్నారు.

మార్చి 9నుంచి స్కూల్ పరీక్షలు

మార్చి 21 నుండి అడ్వాన్స్‌డ్ తరగతులు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 23: తెలంగాణలో 1వ తరగతి నుండి 9వ తరగతి వరకూ వార్షిక పరీక్షలను మార్చి 9 నుండి 16 వరకూ నిర్వహించనున్నారు. నూతన విద్యా క్యాలండర్ ప్రకారం మార్చి 21 నుండి వచ్చే ఏడాది క్లాసులను ప్రారంభించి అడ్వాన్స్ తరగతులు బోధిస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ టైమ్‌టేబుల్‌ను ఖరారు చేసింది. 1 నుండి 5వ తరగతి వరకూ పరీక్షలు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకూ జరుగుతాయి. 6 నుండి 7వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.45 నుండి మధ్యాహ్నం 12.30 వరకూ జరుగుతాయి. 8వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 1.45 నుండి సాయంత్రం 4.30 వరకూ పరీక్షలు ఉంటాయి. 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.45 నుండి మధ్యాహ్నం 12.30 వరకూ పేపర్-1, మధ్యాహ్నం 1.45 నుండి సాయంత్రం 4.30 వరకూ పేపర్-2 జరుగుతాయి. మార్చి మూడో వారంలో టెన్త్ పరీక్షలు మొదలవుతాయి. పరీక్షలు ముగిసిన వెంటనే మార్చి 17 నుండి 19 వరకూ విద్యార్ధులకు మూల్యాంకన పత్రాలను ఇస్తారు. వాటిపై విద్యార్థులు తమ తల్లిదండ్రులతో సంతకాలుచేయించి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. 9వ తరగతి షెడ్యూలు: మార్చి 9న గణితం, 10న పిఎస్, ఎన్‌ఎస్, 11న సోషల్ స్టడీస్, 14న ఫస్టు లాంగ్వేజి , మార్చి 15న సెకండ్ లాంగ్వేజి, మార్చి 16న థర్డు లాంగ్వేజి ఉంటుంది. 8వ తరగతి విద్యార్ధులకు సైతం అదే షెడ్యూలులో పరీక్షలు ఉంటాయి. 6-7 తరగతుల వారికి మార్చి 9న ఫస్టు లాంగ్వేజి, మార్చి 10న సెకండ్ లాంగ్వేజి, 11న థర్టు లాంగ్వేజి, 14న గణితం, 15న సోషల్, 16న జనరల్ సైన్స్ ఉంటాయి. అదే 1 నుండి 5 తరగతుల వరకూ మార్చి 9న ఫస్టు లాంగ్వేజి, మార్చి 10న ఇంగ్లీషు, 11న గణితం, 14న ఈవిఎస్ పరీక్షలు ఉంటాయి.

ఆస్పత్రుల్లో పెట్టుబడి పెడతాం

ముందుకొచ్చిన నెదర్లాండ్స్ సంస్థ
5 వేల కోట్ల పెట్టుబడికి సంసిద్ధత
సిఎం కెసిఆర్ సానుకూల స్పందన

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 23: నెదర్లాండ్స్‌కు చెందిన ఎనరఫ్-నూనియస్ అనే సంస్థ తెలంగాణలో పెద్ద మొత్తం పెట్టుబడితో ఆస్పత్రులు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. వీటి కోసం తమకు నెదర్లాండ్స్‌కు చెందిన రాబోబ్యాంక్ రూ. 5 వేల కోట్ల మేరకు రుణం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని నెదర్లాండ్స్ బృందం వెల్లడించింది. ఎనరఫ్-నూనియస్ సంస్థ ప్రతినిధులు మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి తమ ప్రతిపాదనలను ఆయన ముందుంచారు. ఇప్పటికే తమ సంస్థ శ్రీలంకలో ఆస్పత్రులు నెలకొల్పిందన్నారు. ఈ సంస్థ శ్రీలంకలో నెలకొల్పిన ఆస్పత్రులు ఎలా ఉన్నాయో చూసి రావలసిందిగా వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం నగరాలలో కలిపి ఐదు వేల పైచిలుకు పడకల హాస్పిటల్స్‌ను నెలకొల్పాలని భావిస్తోందని, వీటిలో భాగస్వాములు కావాల్సిందిగా కోరారు.
ఆస్పత్రులు నెలకొల్పడానికి ఆర్థిక సహాయం ఏవిధంగా చేస్తారో, పూర్తి సమాచారంతో ముందుకు వస్తే చర్చిద్దామని సూచించారు.