రాష్ట్రీయం

వంచిస్తున్న మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ ప్రజలను వంచిన్నారంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎపిసిసి) అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఎన్డీయే పాలనపై 3రణ శంఖారావం2 చేశారు.మోసకారి మోదీ నాలుగేళ్ళ పాలనపై ఈ నెల 26న ఆంధ్ర ప్రదేశ్‌లో వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని కాంగ్రెస్ కార్యాలయం (ఇందిరా భవన్)లో 3రణ శంఖారావం2 పోస్టర్‌ను విలేఖరుల సమావేశంలో విడుదల చేశారు. 26న రాష్ట్ర వ్యాప్తంగా రణ శంఖారావం పోస్టర్‌ను విడుదల చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్డీయే అధికారం చేపట్టిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన మోసాలు, ప్రధాని నరేంద్ర మోదీ వంఛనాలను మచ్చుకు 17 అంశాలను పోస్టర్‌లో ప్రస్తావించారు. అవి: 1) ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, గత ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హామీలు, పునర్నిర్మాణ చట్టంలోని అంశాలను అమలు చేయకుండా ద్రోహం చేయడం, పార్లమెంటులో అవిశ్వాసం పెడితే సమాధానం చెప్పకపోవడం, 2) బిజెపి 2014 ఎన్నికల (కేంద్ర, రాష్ట్ర) ప్రణాళికల్లో పేర్కొన్న హామీలను అమలు చేయకుండా వంఛించడం, 3) అధికారం చేపట్టిన 100 రోజుల్లో విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి తెచ్చి పేదల అకౌంట్లలో 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తామని చెప్పి మోసగించడం, 4) బిజెపి పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న వేల కోట్ల భారీ కుంభకోణాలు, అవినీతిపై విచారణలు లేకుండా రక్షణగా నిలవడం, దేశ రక్షణకు సంబంధించి రాఫెల్ యుద్ధ విమానాలను అధిక ధరలకు కొనుగోలు చేసి భారీ అవినీతికి పాల్పడడం, దీనిపై పార్లమెంటులో సమాధానం చెప్పకుండా దాట వేయడం, బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన నీరవ్ మోదీ, లలిత మోదీ, విజయ్ మాల్యాలు దేశం విడిచి పారిపోవడానికి సహకరించడం, 6) రైతుల ఆత్మహత్యలు ఆపుతామని, వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర 50 శాతానికి పైగా పెంచుతామని ఇచ్చిన హామీని మరవడం, బడా కార్పోరేట్ వ్యాపారులకు లక్షల కోట్ల పన్ను రాయితీలు ఇచ్చి దేశంలోని రైతులను మోసగించి, వ్యవయసాయానికి ప్రాధాన్యతనివ్వకపోవడం, 7) తమకు అధికారం అప్పగిస్తే ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ఉపాధి కల్పన చూపిస్తామని ఇచ్చిన హామీని విస్మరించడం, నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా లక్షల ఉద్యోగాలు కోల్పోవడం, 8) 2014కి ముందు యుపిఎ చేసిన సంస్కరణలను పూర్తిగా వ్యతిరేకించి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లేటు ఫిరాయించడం, ఎఫ్‌డిఐల పెంపు, ఆధార్ అమలు, జిఎస్‌టి, తదితర విషయాల్లో సిగ్గు లేకుండా 3యూ-టర్న్2 తీసుకోవడం, 9) గోవా, మణిపూర్, మేఘాలయ, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, ఇటీవల కర్నాటక రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను బాహాటంగా ప్రోత్సహించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం, మైనర్ బాలికలపై, మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు పెరిగిపోతున్నా పట్టించుకోకపోవడం, దోషులకు అండగా నిలవడం వంటి అనేక సమస్యలను రఘువీరా రెడ్డి ప్రస్తావిస్తూ తూర్పారబట్టారు.