రాష్ట్రీయం

మోదీకి మూడింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 22: వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి విభజన హామీలను నెరవేర్చుతానని చెప్పిన ప్రధాని మోదీ మాట తప్పారని ఏపీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. సీమాంధ్ర ప్రజలు ఆమోదించకపోయినా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ లేకుండా చేసినట్టుగానే ఇచ్చిన హామీలను నెరవేర్చని బీజేపీ, ఆ పార్టీకి అండగా ఉన్న పార్టీలను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రజలు సైనికులుగా పనిచేయాలని కోరారు. నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలకు నిరసనగా విశాఖలో మంగళవారం నిర్వహించిన ధర్మపోరాట సభలో చంద్రబాబు ఆవేశపూరిత ప్రసంగం చేశారు. ఎన్నికల ముందు రాష్ట్రాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చిన మోదీ, ప్రధాని అయిన తరువాత హామీలను విస్మరించారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు అనేక హామీలను నెరవేర్చాలని 29సార్లు ఢిల్లీ వెళ్లి అభ్యర్థించినా స్పందించలేదని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి హోదా ఎందుకు ఇవ్వరో ప్రధాని సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హోదా ఆంధ్ర ప్రజల జీవన్మరణ సమస్య అని అన్నారు. ఇక్కడి ప్రజలు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారని అన్నారు. పటేల్ విగ్రహానికి 2500 కోట్లు ఇచ్చిన మోదీ, ఏపీలో రాజధాని నిర్మాణానికి 1500 కోట్లు మాత్రమే ఇచ్చారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి 16వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంటే, అందులో నాలుగు వేల కోట్లే ఇచ్చారని అన్నారు. విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని అంగీకరించిన కేంద్రం, ఇప్పుడు కుంటి సాకులు చెపుతోందని అన్నారు. కేంద్రం మెడలు వంచైనా రైల్వే జోన్ సాధించుకుంటామని అన్నారు. రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ క్రూడ్ ఆయిల్ ప్రాజెక్ట్, పెట్రో కెమికల్ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు ఏడు వేల కోట్ల రూపాయలు కావాలని కేంద్రం కోరిందని, ఆ డబ్బు ఇస్తే, ప్రైవేటు సంస్థలే ప్రాజెక్ట్‌లను నెలకొల్పుతాయని చంద్రబాబు అన్నారు. దుగ్గరాజపట్నం పోర్టు విషయంలో కేంద్రం సన్నాయి నొక్కులు నొక్కుతోందని అన్నారు. విజయవాడ, విశాఖల్లో మెట్రో రైలు ప్రాజెక్ట్‌లు రాకుండా చేసిందని అన్నారు. బుందేల్‌ఖండ్ ప్యాకేజీ మాదిరి ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఇస్తామన్న నిధులు ఇచ్చినట్టే ఇచ్చి, వెనక్కు తీసుకున్నారని అన్నారు. రాష్ట్రంలో శాసనసభ సీట్లు పెంచితే, టీడీపీ ఎక్కడ బలపడుతుందోనన్న భయంతో దాన్ని కూడా పక్కన పెట్టేశారని చంద్రబాబు విమర్శించారు. తెలుగువారి ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే, ఎంతటివారైనా లెక్కపెట్టనని చంద్రబాబు హెచ్చరించారు. నాలుగు సంవత్సరాల నుంచి డబ్బు లేకపోయినా, అన్ని రకాలుగా వత్తిడులను ఎదుర్కొంటున్నా, రాష్ట్భ్రావృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నానని చంద్రబాబు అన్నారు. తాను తీవ్రవాదులకు భయపడను..మత కలహాలకు బెదిరిపోను.. ముఠాలకు, రౌడీలకు బెదరను. ఎవరైనా తోక జాడిస్తే, వదిలిపెట్టనని చంద్రబాబు హెచ్చరించారు. చేతనైతే రాష్ట్భ్రావృద్ధికి సహకరించండి. కుట్ర రాజకీయాలు చేయద్దని విజ్ఞప్తి చేశారు.
ప్రత్యేక హోదా కోసం టీడీపీ నిస్వార్థ పోరాటం చేస్తుంటే, వైసీపీ పార్లమెంట్‌లో మోదీ పట్ల విశ్వాసం ప్రదర్శిస్తూ, బయటకు వచ్చి అవిశ్వాసాన్ని ప్రకటించడం ఎంతవరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇటీవల ఓ పెద్ద మనిషికి ఢిల్లీ పెద్దలు స్క్రిప్ట్ రాసి ఇచ్చారు. అతనిని తనపై ప్రయోగిస్తున్నారని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి విమర్శించారు. 12 కేసులలో జగన్ అడ్డంగా దొరికిపోయి, జైలు శిక్ష అనుభవిస్తూ, ఇప్పటికీ వారినికి ఒకసారి కోర్టుకు వెళ్లి సంతకం చేసి వస్తూ, తనను విమర్శించడం శోచనీయమని అన్నారు. ఇలాంటి వారిని ఎదిరించడానికి తెలుగువారంతా ఒక్కటి కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో 25 లోక్‌సభ స్థానాల్లో టీడీపీని గెలిపించడం చారిత్రిక అవసరమని ఆయన అన్నారు. రాష్ట్రం కోసం పోరాడుతున్న తనకు విపక్షాలు సహకరించకుండా, రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్రానికి అండగా ఉండడాన్ని సహించలేక అన్ని జిల్లాల్లో ధర్మపోరాట సభలు నిర్వహిస్తున్నామని చంద్రబాబు చెప్పారు.