రాష్ట్రీయం

అంతర్ జిల్లా బదిలీలకు ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల నిబంధనలు, షెడ్యూలు ఖరారుపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించారు. జీవో 12లో స్వల్ప మార్పులతో అమలుకు అంగీకరించారు. సంఘాలు సూచించిన సవరణలతో ముసాయిదాను రూపొందించే పనిని కమిషనర్‌కు అప్పగించారు. మూడు జేఏసీలు సమర్పించిన లేఖల్లోని అంశాలను క్రోడీకరించి, ఉమ్మడి అంశాలను నిబంధనల్లో చేర్చాలని, ఏకాభిప్రాయం లేని అంశాలపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని మంత్రి సూచించారు. ముందుగా అంతర్‌జిల్లా భార్య భర్తల బదిలీలు నిర్వహించాలని నిర్ణయించారు. తదుపరి క్యాడర్ వారీ బదిలీలు, పదోన్నతులు
నిర్వహిస్తారు. పాత పది జిల్లాల ప్రాతిపదికన బదిలీలు జరుపుతామని అన్నారు. ఏజన్సీలో పనిచేస్తున్న మైదన ప్రాంత ఉపాధ్యాయులను ఖాళీల లభ్యత మేరకు మైదాన ప్రాంతానికి బదిలీ చేస్తారు. మోడల్ స్కూల్, కేజీబీవీ ఉపాధ్యాయులకు బదిలీలు నిర్వహించాలని కోరగా, సాధ్యా సాధ్యాలను పరిశీలించి నిర్ణయిస్తామని అన్నారు. పదోన్నతులపై ప్రభఉత్వ ఉపాధ్యాయులతో చర్చలు జరిపిన తర్వాత ఏకాభిప్రాయం సాధించి, న్యాయ వివాదానికి కోర్టు బయట వివాదానికి పరిష్కారానికి ప్రయత్నించమని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. వార్షిక విద్యా క్యాలండర్ ముసాయిదాను ఈ సందర్భంగా ఖరారు చేశారు. సిసిఇ విధానంపై భిన్నాభిప్రాయాలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రంజీవ్ ఆచార్య ఆధ్వర్యంలో కమిటీ ఒక వర్కుషాప్‌ను నిర్వహించి నిర్ణయం తీసుకోనుంది. స్కూల్ అసిస్టెంట్ -1, స్కూల్ అసిస్టెంట్ -2లకు సిలబస్‌లో విభజన వచ్చే సంవత్సరం ఆలోచిస్తారు. భౌతిక శాస్త్రం పోస్టులు ఏర్పడినపుడు జారీ చేసిన ఉత్తర్వులను కొనసాగించాలని నిర్ణయించారు. డిజిటల్ తరగతుల కోసం కొత్త సిలబస్ ఆధారంగా సీడీల తయారీపై చర్చించాలని కూడా నిర్ణయించారు. ప్రీప్రైమరీ స్కూల్ తరగతుల దత్తతపై సమీక్ష నిర్వహించి అనంతరం నిర్ణయం తీసుకుంటారు. ఇతర బాధ్యతల్లో, ఆఫీసుల్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న టీచర్లను రిలీవ్ చేయాలని నిర్ణయించారు. బదిలీలు, పదోన్నతులపై కూడా విస్తృతమైన చర్చ జరిగింది. సమీక్షలో టిపిటిఎఫ్ తరఫున ప్రధానకార్యదర్శి మైన శ్రీనివాస్ పాల్గొన్నారు.

నేడు ఈసెట్ ఫలితాలు
ఇంజనీరింగ్ యుజిలో చేరేందుకు నిర్వహించిన ఈసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి గురువారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారని కన్వీనర్ డాక్టర్ ఏ గోవర్ధన్ తెలిపారు.