రాష్ట్రీయం

వివాదం సమసిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదినం సందర్భంగా సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ ఎమ్మెల్యేగా సంభోదించటం సంచలనమైంది. సీఎం లెటర్‌హెడ్‌పై శుభాకాంక్షలు తెలుపుతూ కోమటిరెడ్డి పక్కన ఎమ్మెల్యే అని రాయడం కాంగ్రెస్‌లో చర్చనీయాంశమైంది. మార్చిలో జరిగిన కౌన్సిల్, అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ నరసింహన్ పట్ల దురుసుగా ప్రవర్తించి కౌన్సిల్ చైర్మన్ కె. స్వామిగౌడ్‌ను గాయపర్చారన్న అభియోగాలపై కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వాలను రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేయడం తెలిసిందే. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలు హైకోర్టులో ఛాలెంజ్ చేయడం, హైకోర్టు అడిగిన వీడియో క్లిప్పింగ్‌లను ప్రభుత్వం అందజేయకపోవడం, గవర్నర్ ప్రసంగించే రోజు సభ స్పీకర్ పరిథిలో ఉండదన్న పిటీషనర్ వాదనతో కోర్టు ఏకీభవించి వారి సభ్యత్వాల రద్దు చెల్లదని తీర్పు ఇచ్చింది. అయినా ఆ కథ సుఖాంతం కాలేదని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వారిని సభలో కాలు పెట్టనివ్వరన్న వదంతి ఉంది. ఇలాఉండగా కోమటిరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పంపించిన లేఖలో ఎమ్మెల్యే అని పేర్కొనడంతో కథ సుఖాంతమైనట్లేనా? అని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది. కోమటిరెడ్డి బుధవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం పంపించిన జన్మదిన శుభాకాంక్షల లేఖను చూపించారు. లేఖలో తనను ఎమ్మెల్యేగా పేర్కొన్నందున, ఆ మేరకు సౌకర్యాలన్నింటినీ తక్షణం కల్పించాలని కోరారు. తాను 30 ఏళ్లుగా పార్టీలోవుంటూ ఎప్పుడూ ఏ పదవీ ఆశించలేదన్నారు. ఇటీవల తమ పార్టీలో చేరిన ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి అప్పుడే పదవుల గురించి మాట్లాడటం సమంజసం కాదన్నారు. కేసీఆర్ మరోసారి సీఎం అయితే మనల్ని భిక్షగాళ్ళు చేస్తారని హెచ్చరించారు. తనకు ఏ పదవీ వద్దనీ కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యమని వివరించారు.