రాష్ట్రీయం

ఆలయ ప్రతిష్టకే భంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మే 24: తిరుమల ఆలయ ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణ దీక్షితులుపై చర్యలు తీసుకునే అంశాన్ని బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. కర్నూలులో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తూ, భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రమణ దీక్షితులు ప్రవర్తించారని ఆరోపించారు. ప్రధాన అర్చకుడి పదవి నుంచి తొలగించారన్న ఆక్రోశంతో రాజకీయ నాయకుల సహకారంతో ఆలయ ప్రతిష్టకు రమణ దీక్షితులు భంగం కలిగించారని మండిపడ్డారు. దీక్షితులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. దీన్ని గతంలో టీటీడీలో పనిచేసిన అధికారులు, బోర్డు మాజీ సభ్యులు స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆలయంలో స్వామి ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయన్నారు. ఆగమ శాస్త్రం అనుమతిస్తే వాటిని భక్తుల ఎదుట ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించామన్నారు. కైంకర్యాలు సక్రమంగా జరగడం లేదని రమణ దీక్షితులు చెప్పడం కేవలం రాజకీయమేనన్నారు. తద్వారా తనతో పాటు ప్రధాన అర్చకులుగా పనిచేసిన వారు, ప్రస్తుతం ఆ బాధ్యతలను నిర్వహిస్తున్న వారందరినీ దీక్షితులు అవమానపర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రమణ దీక్షితులు కోర్టును ఆశ్రయించనున్నారన్న విషయంపై స్పందిస్తూ ఆయనకు ఆ హక్కు ఉందన్నారు. కోర్టుకు వెళ్తే తమకు అభ్యంతరం ఏమీలేదని వెల్లడించారు. భవిష్యత్తులో కోర్టు ఆదేశాలను తాము అమలు చేస్తామని వివరించారు. అంతకు ముందు ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసి టీటీడీ పరువు తీశారన్న అంశంపై తాము చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న ఆలోచనతో ఉన్నామన్నారు. దీనిపై బోర్డు సభ్యులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని సుధాకర్ యాదవ్ తెలిపారు. తిరుమలపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శ్రీ వారి నగలు భద్రంగా ఉన్నాయని, కైంకర్యాలు ఆగమశాస్త్రం ప్రకారం జరుగుతున్నాయని సుధాకర్ స్పష్టం చేశారు.