రాష్ట్రీయం

జోన్ల వ్యవస్థకు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24: రాష్ట్రాన్ని ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లుగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జోన్ల విభజన, కొత్త జోన్ల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం ప్రభుత్వ విధాన నిర్ణయంపై ప్రకటన చేశారు. తెలంగాణ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చడంతో పాటు, గతంలో జరిగిన అన్యాయం పునరావృతం కాకుండా జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకోవడంతో ఆయా ప్రాంతాల్లోని స్థానికులకు ఎక్కువ ప్రయోజనం కలిగే విధంగా జోన్ల పునర్విభజన చేసినట్టు సీఎం వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడం, ఆ తర్వాత జిల్లాల పునర్విభజన జరగడంతో జోన్ల వ్యవస్థను పునర్విభజన చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. జోన్ల ఏర్పాటుపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి ఇప్పటికే తమ ప్రతిపాదనలు అందజేయండతో గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించారు. అనంతరం రాష్ట్రాన్ని ఏడు జోన్లుగా, రెండు మల్జీ జోన్లుగా ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలోని 31 జిల్లాలను వివిధ జోన్లు, మల్జీ జోన్లుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించిన అంశంపై తెలంగాణ గెజిటెడ్ అధికారుల భవన్‌లో శుక్రవారం ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మరోసారి చర్చించిన తమ అభిప్రాయాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలియజేస్తారు. ఉద్యోగ సంఘాల అభిప్రాయంపై సిఎస్ ప్రభుత్వానికి నివేదికను అందజేస్తారు. అనంతరం దీనిపై మంత్రిమండలి సమావేశమై అమోదించాక కేంద్రానికి, రాష్టప్రతి ఆమోదానికి పంపించనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని తానే స్వయంగా పర్యవేక్షించి కొత్త జోనల్, మల్జీ జోనల్ వ్యవస్థ అమలులోకి వచ్చేలా చూస్తానని సిఎం హామీ ఇచ్చారు.
స్వాగతించిన ఉద్యోగ సంఘం
రాష్ట్రాన్ని ఏడు జోన్లుగా, రెండు మల్టీ జోన్లుగా విభజించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ఉద్యోగుల సంఘం స్వాగతించింది. రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా చేయాలని ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రిని కోరితే ఏడు జోన్లుగా చేయడం మరింత సంతోషం కలిగించిందని తెలంగాణ ఉద్యోగుల సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు పద్మాచారి హర్షం వ్యక్తం చేసారు. ఉమ్మడి రాష్ట్రంలో
ఉద్యోగులకు జరిగిన అన్యాయం పునరావృతం కాకుండా కొత్త జోనల్ వ్యవస్థ దోహదం చేస్తుందన్నారు. ఉద్యోగులతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలకు కొత్త జోనల్ వ్యవస్థ వల్ల ప్రయోజనం చేకూరుతుందని పద్మాచారి అన్నారు.
------------------------------------
జోన్లు...మల్టీ జోన్లు, వాటి పరిధిలోని జిల్లాలు
-------------------------------------
క్ర.సం జోన్ జనాభా పరిధిలోకి వచ్చే జిల్లాలు
1 కాళేశ్వరం 28.29 లక్షలు భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి
2 బాసర 39.74 లక్షలు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల
3 రాజన్న 43.09 లక్షలు కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్
4 భద్రాద్రి 50.44 లక్షలు కొత్తగూడెం, ఖమ్మం,మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్
5 యాదాద్రి 45.23 లక్షలు సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి, భువనగిరి, జనగామ
6 చార్మినార్ కోటి మూడు లక్షలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి
7 జోగులాంబ 44.63 లక్షలు మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, వికారాబాద్
--------------------
మల్టీ జోన్లు
క్ర.సం జోన్ల పరిధి జనాభా
1 కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి కోటి 61లక్షలు
2 యాదాద్రి, చార్మినార్, జోగులాంబ కోటి 88 లక్షలు

చిత్రం..గురువారం ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నేతలతో చర్చిస్తున్న సీఎం కేసీఆర్