రాష్ట్రీయం

ఇదెక్కడి న్యాయం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: తెలుగుదేశం పార్టీ కోసం నా రక్తాన్ని ధారపోస్తే తన పట్ల పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర మనోవేదనకు గురిచేస్తోందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మోత్కుపల్లి మాట్లాడారు. నేనేం తప్పుచేశానో తెలియడం లేదని, చేసిన తప్పుచెబితే సంతోషిస్తానని అన్నారు. నా జీవితం మొత్తం మీ కోసం అంకితం చేస్తే నాకిచ్చే బహుమతి ఇదేనా.. అని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును ప్రశ్నించారు. నందమూరి తారక రామారావు సిద్ధాంతాలతో ప్రేరణ పొంది పార్టీలో చేరి కష్టకాలంలో సైతం మీ వెంట ఉన్న విషయాన్ని మరిచారా అన్నారు.
తానొక సామాన్యుడినని, డబ్బులేక పోయినా ఆలేరు ప్రజల ప్రేమాభిమానాలతో ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని చెప్పారు. మాదిగ సామాజిక వర్గంలో పుట్టి ఎన్‌టీఆర్ వద్ద నుంచి నేర్చుకున్న నీతి, నియమాలతో రాజకీయాల్లో కొనసాగుతున్నానని తెలిపారు.
మాదిగ బిడ్డ నీతి పనిచేయడం లేదని, తానొక దళితుడినైనందుకే వివక్ష ప్రదర్శిస్తున్నారని వాపోయారు. తన వల్ల పార్టీకి ఏం నష్టం జరిగిందో అర్ధం కావడం లేదని అన్నారు. పార్టీకి పండుగలాంటి మహానాడుకు తనను పిలవలేదని విచారం వ్యక్తం చేశారు. చివరి నిమిషం వరకు బాబు నుంచి ఫోన్ వస్తుందని ఎంతో ఆత్రుతగా ఎదురుచూశానని చెప్పారు.
రేవంత్ రెడ్డి లాంటి మూర్ఖుడి కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలంతా ప్రజల ముందు తలదించుకునే పరిస్థితి ఎదురైందన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడ్డ టీఆర్‌ఎస్ పార్టీని కూలదోసేందుకు ప్రయత్నించడం తప్పుకాదా? అని ప్రశ్నించారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు 10 ఏళ్ల పాటు హైదరాబాద్‌లో ఉండాల్సిన మిమ్మల్ని ఒకటిన్నర సంవత్సరాలకే విజయవాడకు వెళ్లాల్సి వచ్చేలా చేసిన రేవంత్‌పై ఉన్న ప్రేమాభిమానాలకు మాపై ఎందుకు ఉండవని నిలదీశారు. ఒక ఫాల్తుగాడి కోసం పార్టీని నాశనం చేయడాన్ని పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్న తన లాంటి వారు జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు.
చంద్రబాబును నమ్ముకున్నందుకు నా జీవితం పాడుచేసుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంతో పాటు ప్రతిపక్షంలో ఉన్న ఎన్నోసార్లు మీ కోసం తపించిన విషయం గుర్తులేదా అంటూ వాపోయారు. డబ్బులు శాశ్వతం కాదని, నీతివంతమైన రాజకీయాల కోసం పనిచేయాలని, ధర్మం కోసమే మోత్కుపల్లి పనిచేస్తాడు తప్ప తప్పుచేయబోనని స్పష్టం చేశారు. నీవ్వు మోసగాడివని ఎంతో మంది చెప్పినా వినకుండా నీతో నడిచినందుకు నట్టేట ముంచే ప్రయత్నం ఎందుకున్నారు. పార్టీ సీనియర్‌ల పట్ల అనుసరిస్తున్న తీరు తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందని, ఎన్‌టీఆర్‌తో పనిచేసిన తొలి తరం నేత గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడు చనిపోతే నివాళి అర్పించేందుకు సైతం రాలేదని, భవిష్యత్‌లో నేను చనిపోయినా చంద్రబాబు వస్తాడని నమ్మకం లేదని అన్నారు. పార్టీనే దైవం అని భావించే వారిని దూరం చేసుకుంటూ పార్టీని స్మశానం చేస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా చంద్రబాబు పార్టీపై దృష్టి సారిస్తే తిరిగి పూర్వవైభవం వస్తుందన్నారు. తన తప్పేంటో చెప్పే వరకు ఏపీలో సైతం పర్యటిస్తానని చెప్పారు.
కేసీఆర్‌ను ప్రశంసించిన మోత్కుపల్లి...
చంద్రబాబు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మోత్కుపల్లి కేసీఆర్‌ను ప్రశంసించారు. ఇటీవల రాజ్యసభ సభ్యులుగా బడుగు వర్గాలకు చెందిన నాయకులను చేసి ఎన్‌టీఆర్‌ను గుర్తుచేశారని అన్నారు. అదే విధంగా తన కుమార్తె వివాహానికి వచ్చి దీవించారని, అదే సమయంలో చంద్రబాబు కోసం తాము పడిగాపులు కాయాల్సి వచ్చిందన్నారు. కొన్ని విషయాల్లో కేసీఆర్ మంచోడు అన్నందుకే తనపై కక్షగట్టారని, పార్టీ మొత్తాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేయాలన్న వారితో ఇప్పటికీ టచ్‌లో ఉన్నారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా పార్టీ వీడుతున్నా అంటే చంద్రబాబు తనతో ఒక్కసారి మాట్లాడితే ఆయన చనిపోయే వరకు లేదా తాను చనిపోయే వరకు పార్టీని వీడనని,అలా కాకుండా ఉంటే కాలమే నిర్ణయిస్తుందన్నారు.