రాష్ట్రీయం

మొదలైన పవన్ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మే 25: రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన ఇచ్చిన డిమాండ్లపై 48 గంటల గడువులోగా స్పందించకపోవడంతో దీక్షకు సిద్ధమయ్యారు. ఉద్దానం కిడ్నీ రోగుల సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన పవన్‌కళ్యాణ్ తాను చెప్పినట్టే శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి తాను బస చేసిన రిసార్ట్స్‌లోనే నిరహారదీక్ష ప్రారంభించారు. శనివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ప్రజల మధ్యకు రానున్నారు. అయితే, కలెక్టర్, ఎస్పీ అందుకు ఇంకా అనుమతి ఇవ్వకపోవడంతో పార్టీ కార్యకర్తలు కార్పొరేషన్ కార్యాలయం ముందు
ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి అనుమతులు కోరారు. కిడ్నీ బాధితులకు అండగా నిలిచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ రెండు రోజుల క్రితం పలాసలో పవన్‌కళ్యాణ్ 48 గంటల డెడ్‌లైన్‌ను ప్రభుత్వానికి విధించినా స్పందించకపోవడంతో ఒకరోజు దీక్షకు సిద్ధమయ్యారు. ఆరోగ్య శాఖకు మంత్రిని నియమిచాలని, ఉద్దానంలో హెల్త్ ఎమర్జన్సీని ప్రకటించాలని, మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసి స్వయంగా సీఎం పర్యవేక్షించాలన్న 17 డిమాండ్లను పవన్‌కళ్యాణ్ ప్రభుత్వానికి విధించారు. సీఎం స్వయంగా కిడ్నీబాధితుల సమస్యలపై అధికారులతో సమీక్షించి ఆదేశాలు జారీ చేసినా అవేమీ కార్యరూపం దాల్చకపోవడంతో ప్రభుత్వం స్పందించే తీరును పవన్‌కళ్యాణ్ తప్పుపట్టారు. ఆ మేరకు ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ బస చేస్తున్న ఎచ్చెర్ల మండలం ఎస్.ఎస్.ఆర్.పురంలో రిసార్ట్స్ వేదికగానే దీక్షను శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో జనసేన నాయకులు, కార్యకర్తలు తలమునకలయ్యారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ చేపట్టే ఒక రోజు నిరాహారదీక్షను విజయవంతం చేసేలా వారంతా కసరత్తు చేస్తున్నారు. అటు నగరపాలక సంస్థ అధికారులు, ఇటు పోలీసుల వద్దకు వెళ్ళి దరఖాస్తులు ఇచ్చారు. తొలుత ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానాన్ని జనసేన నాయకులు కార్యకర్తలు తమ పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ చేపట్టే దీక్ష కోసం పరిశీలించారు. నాయకులంతా సమావేశమై పరిస్థితులను సమీక్షించుకున్నారు. ఆ వెంటనే నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీరాములునాయుడును కలిసి ఎన్టీఆర్ హైస్కూల్ మైదానంలో దీక్ష నిర్వహించేందుకు అనుమతివ్వాలని దరఖాస్తు అందజేసారు. ఎస్పీ త్రివిక్రమవర్మను కలుసుకుని దీక్ష చేపట్టేందుకు అనుమతివ్వాలని కోరారు. అయితే హైస్కూల్ మైదానంలో దీక్ష చేపడితే ట్రాఫిక్‌తోపాటు ఇతరత్రా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని, భద్రతా చర్యలు దృష్ట్యా ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానం లేదా వేరే ప్రాంతంలో దీక్ష చేసుకోవాలని సూచించినట్లుగా జనసేన నేతలు ‘ఆంధ్రభూమి’కి తెలిపారు. ఏదేమైనప్పటికీ ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానానికి జనసేన నేతలు, కార్యకర్తలు దీక్ష నిర్వాహణకు కావాల్సిన సరంజామాతో చేరారు. దీక్ష ద్వారా పవన్, మానవతా దృక్పథంతోనైనా ప్రభుత్వం స్పందించాలని విన్నవించనున్నారు. ఉద్దానం వాసులకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తామని ప్రభుత్వానికి ఈ దీక్షా వేదికగా హెచ్చరించనున్నారు. జిల్లా నలుమూలల నుంచి కూడా జనసేన నాయకులతోపాటు పవన్ అభిమానులు దీక్షాశిబిరం వద్దకు చేరుకునే అవకాశలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది.