రాష్ట్రీయం

నాలుగంచెల వ్యవస్థకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: జోనల్, మల్టీ జోనల్‌తోపాటు స్టేట్, డిస్ట్రిక్ట్ క్యాడర్లతో నాలుగంచల వ్యవస్థ ఉండాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారుల, సిబ్బంది, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అలాగే సీఎం కేసీఆర్ ప్రకటించిన ఏడు జోన్లలో కొన్ని చేర్పులు, మార్పులనూ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వానికి సూచించింది. తమ ప్రతిపాదనలను సీఎస్ ఎస్‌కె జోషికి జేఏసీ అందజేసింది. దీనిపై సీఎం మరోసారి చర్చించాక మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన అనంతరం రాష్టప్రతి ఆమోదానికి కేంద్రానికి పంపించనుంది.
తాను ఖరారు చేసిన జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థలపై ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను సీఎం కోరిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యాలయంలో శుక్రవారం జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ కారం రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ వి మమత, గెజిటెడ్ అధికారుల సంఘం కేంద్ర కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ స్టేట్ బ్రెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ జి దేవిప్రసాద్, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి తదితర ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమై చర్చించారు. ముఖ్యమంత్రి ప్రకటించిన జోనల్ వ్యవస్థలో కొన్ని చేర్పులు, మార్పులను సూచిస్తూ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. ప్రధానంగా రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగంలో నాలుగంచల వ్యవస్థ ఉండాలని ప్రతిపాదించింది. అలాగే భద్రాద్రి జోనల్ పేరుకు కాకతీయను జోడించి భద్రాద్రి-కాకతీయ జోనల్‌గా పేరు మార్చాలని కోరింది. అలాగే యాదాద్రి జోనల్‌లో చేర్చిన జనగామ జిల్లాను భద్రాద్రి జోనల్‌లో, వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్‌లో, రంగారెడ్డి జిల్లాను జోగులాంబ జోన్‌లో చేర్చాలని పలు సవరణలను జాయింట్ యాక్షన్ కమిటీ సూచించింది.
శాఖాధిపతులు/ సచివాలయానికి జరిగే బదిలీల్లో ఆయా జోన్లకు కోటాను అమలు చేయాలని, శాఖాధిపతులు/ సచివాలయ పోస్టులను మినహాయించి మిగిలిన రాష్టస్థ్రాయి పోస్టులను మల్టీ జోనల్‌లో కేడర్‌ను ఖరారు చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ సూచించింది. శాఖలవారీగా కేడర్ల వివరాలపై మరో నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు జాయింట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వానికి తెలియజేసింది.